Aishwarya Rai Second Child: బాలీవుడ్‌తోపాటు యావత్ భారతదేశ సినీ పరిశ్రమలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని విస్తృతంగా వార్తలు ప్రచారం అవుతున్న సమయంలో అభిషేక్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఐశ్వర్యతో తనకు కలిగిన సంతానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్య రాయ్ మరోసారి గర్భం దాల్చారా? రెండో సంతానం కలుగుతుందా? ఓ టీవీ షోలో హోస్ట్ ప్రశ్నించగా.. అభిషేక్ బచ్చన్ స్పందించిన తీరు వైరల్‌గా మారింది.
Also Read: Jani Master: ప్రతిభను ఎవరూ తొక్కలేరు.. అసత్య వార్తలపై జానీ మాస్టర్ ఆగ్రహం
బాలీవుడ్‌లో 'కేస్ తో బనతా హై' అనే షోను నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీ టాక్ షోగా గుర్తింపు పొందిన ఆ షోలో అభిషేక్ బచ్చన్ పాల్గొన్నాడు. ఇంటర్వ్యూ సమయంలో అభిషేక్‌ను రెండో సంతానం విషయం ప్రశ్న వేయగా.. జూనియర్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆరాధ్య తర్వాత ఏమిటి?' అని రితేశ్ ప్రశ్నించగా.. అభిషేక్ నవ్వుకున్న అనంతరం స్పందించాడు. 'రితేశ్ పెద్దవారిని గౌరవించాలి. నేను నీ కంటే పెద్దవాడిని. ఇలాంటి ప్రశ్నలు బహిరంగంగా అడగడం సరికాదు' అంటూ దాటవేశారు. 'అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య.. ఇలా పేరులో మొదటి అక్షరం ఏ అనేది తమ కుటుంబంలో ఒక సంప్రదాయంగా మారింది' అని తెలిపారు.
Also Read: Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?
కాగా విడాకుల వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న సమయంలో రెండు రోజుల కిందట జరిగిన ఓ వివాహ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య కలిసి హాజరయ్యారు. ఫంక్షన్ లో వారిద్దరూ సందడి చేశారు. వారిద్దరూ కలిసి రావడంతో కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి. కలిసి రావడంతో వారి విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. కాగా తమ కొడుకు కోడలు విడాకుల ప్రచారంపై అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో తన సమాధానంతో ఫుల్‌స్టాప్ పెట్టారు. 'బుద్ధి లేని వారు లేదా మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారికి ఈ ప్రపంచంలో కొదవే లేదు. మా వ్యక్తిగత జీవితాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటివారి గురించి రోజూ ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తూనే ఉంటారు. ప్రసారం చేస్తుంటారు' అని ఫేక్ న్యూస్‌పై అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ కొట్టిపారేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.