Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఇండిగో సంస్థ నుంచి ప్రత్యేక ఎయిర్ బస్ సర్వీసులు అందుబాటులో వస్తున్నాయి. ఇవాళ కాస్సేపటి క్రితం ముంబై రాజమండ్రి సర్వీసు ప్రారంభం కాగా దేశ రాజధాని ఢిల్లీకు ఈ నెల 12 నుంచి అందుబాటులో రానుంది.
రాజమండ్రి విమానాశ్రయానికి ఇప్పుడు కనెక్టివిటీ మరింతగా పెరిగింది. ఇప్పటి వరకూ కేవలం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకే విమాన సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడి దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్ధిక రాజదాని ముంబైకు విమాన సర్వీసులు అందుబాటులో వస్తున్నాయి. ఇండిగో నుంచి ఎయిర్ బస్ సేవలు ప్రారంభమౌతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ అంటే ఇవాళ్టి నుంచి ముంబై టు రాజమండ్రి, రాజమండ్రి టు ముంబై ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభమైంది. ముంబై నుంచి రాజమండ్రికి తొలి ఎయిర్ బస్ సాయంత్రం 6.45 గంటలకు చేరుకుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు రాజమండ్రి నుంచి ముంబైకు ఎయిర్ బస్ బయలుదేరింది. రాజమండ్రి-ముంబై మధ్య ప్రయాణ సమయం 1 గంట 50 నిమిషాలుంది. రోజూ సాయంత్రం 4.50 గంటలకు ముంబై నుంచి రాత్రి 7.15 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరనుంది. ముంబై నుంచి రాజమండ్రికి 172 మంది ప్రయాణీకులతో విమానం చేరుకోగా రాజమండ్రి నుంచి 120 మంది ప్రయాణీకులతో ముంబైకు బయలుదేరింది.
ఇక డిసెంబర్ 12 నుంచి దేశ రాజదాని ఢిల్లీకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మొదటి ఎయిర్ బస్ ఢిల్లీ నంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి ఉదయం 9.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుతుంది. ఇక రాజమండ్రి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మద్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుతుంది. రాజమండ్రి - ఢిల్లీ విమానాశ్రయాల మధ్య ప్రయాణ సమయం 2 గంటల 15 నిమిషాలుంది. రోజూ ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి, ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి నుంచి ఎయిర్ బస్ విమానం బయలుదేరనుంది.
Also read: TTD Guidelines: టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ, ఎల్లుండి నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.