New Central Govt Schemes 2024: ఎక్కువ మొత్తంలో వడ్డీని పొందాలనుకుంటున్నారా? మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (Mahila Samman Savins Certificate Scheme)లో భాగంగా మహిళలు పెట్టుబడి పెట్టడం వల్ల భారీ మొత్తంలో వడ్డీ పొందుతారు.
New Central Govt Schemes 2024: మహిళా సాధికారత కోసం, భారతీయ స్త్రీలకు ప్రోత్సహించేందుకు క్రేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను లాంచ్ చేస్తూ వస్తోంది. గత కేబినెట్ చర్చల్లో భాగంగా స్త్రీలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు 2023 సంవత్సరం ఏప్రిల్ 1వ తేది కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేంద్ర పరిచయం చేసిన ఈ కొత్త పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (Mahila Samman Savins Certificate Scheme).. ఈ పథకం ద్వారా భారత మహిళలు డబ్బులు జమ చేసుకుంటే భారీ మొత్తంలో వడ్డీ రేట్లు పొందే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో భాగంగా పెట్టుబడులు పెట్టిన వారిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు MP రాష్ట్రానికి సంబంధించిన 7,46,223 మంది మహిళలు లబ్ధిపొందినట్లు తెలుస్తోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో భాగంగా ఇక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే చాలు.. దీని ద్వారా ప్రతి నెల గరిష్ఠంగా వడ్డీని పొందవచ్చు.
ఈ పథకంలో భాగంగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తోంది.
అలాగే ఈ పథకం నుంచి డబ్బులు తీసుకోవడం కూడా చాలా సులభం.. మెచ్యూరిటికి ముందే డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో భాగంగా డబ్బులను దాదాపు 2 సంవత్సరాల పాటు ఖాతాలో ఉంచాల్సి ఉంటుంది.
ఈ పథకంలో మైనర్ బాలికలికపై కూడా పెట్టుబడులు పెట్టుకునే సదుపాయాన్ని అందిస్తోంది. వారికి సంబంధించిన సంరక్షకులు మార్చి 31, 2025లోపు పెట్టుబడి పెట్టి ఖాతా తెరిస్తే.. మంచి వడ్డీని పొందుతారు.