కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ... ఈ రోజు సొంత నియోజకవర్గంలో పర్యటించారు. చాలా కాలం తర్వాత కేరళలోని సొంత నియోజకవర్గం వాయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ .. అక్కడ సేవ్ కాన్టిట్యూషన్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కల్పట్ట ప్రాంతంలో జరిగిన ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ తోపాటు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కల్పట్ట ప్రాంతంలో రాహుల్ గాంధీ సేవ్ కాన్సిట్యూషన్ పేరుతో నిర్వహించిన ర్యాలీకి ప్రాధాన్యం లభించింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
#WATCH Rahul Gandhi, Congress in Kalpetta, Kerala: Nathuram Godse shot Mahatma Gandhi because he did not believe in himself, he loved no one, he cared for nobody, he believed in nobody and that is the same with our Prime Minister, he only loves himself, only believes in himself. pic.twitter.com/itx4GKiVIM
— ANI (@ANI) January 30, 2020
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేతో ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ పోల్చారు. వారిద్దరి ఆలోచనా విధానం ఒక్కటేనని చెప్పారు. నాథూరామ్ గాడ్సే ఎవరినీ ప్రేమించే వాడు కాదని .. అలాగే మోదీ కూడా ఎవరినీ ఇష్టపడరని అన్నారు. నాథూరామ్ గాడ్సే ఎవరినీ నమ్మేవాడు కాదన్న రాహుల్ .. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎవరినీ నమ్మరని స్పష్టం చేశారు. నాథూరామ్ గాడ్సే లాగే .. మోదీ కూడా తనను తాను మాత్రమే నమ్ముతారని తెలిపారు. ఐతే నాథూరామ్ గాడ్సేకు ప్రధాని నరేంద్ర మోదీకి చిన్న తేడా ఉందని తెలిపారు. అదేంటంటే నాథూరామ్ గాడ్సేను నమ్ముతానని చెప్పే ధైర్యం మోదీకి లేదన్నారు.