SRH Retained List: ఆ ఐదుగురిపై అపార నమ్మకం పెట్టుకున్న కావ్య పాప, భారీ ధర చెల్లింపు

SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2024, 06:43 PM IST
SRH Retained List: ఆ ఐదుగురిపై అపార నమ్మకం పెట్టుకున్న కావ్య పాప, భారీ ధర చెల్లింపు

SRH Retained List: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాణం పోసిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలాకాలంగా పరాజయంతో ఉన్న జట్టు గత సీజన్‌లో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఫైనల్ వరకు చేరింది. చివరికి రన్నరప్‌గా నిలిచింది. ఎస్ఆర్‌హెచ్ విజయంలో కీలకపాత్ర్ పోషించిన ఆ ఐదుగురిని మేనేజ్‌మెంట్ మర్చిపోలేదు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విదేశీ ఆటగాళ్లలో ఒకరిద్దరిని వదులుకుంటుందని భావించారు. కానీ వాళ బీసీసీఐకు సమర్పించిన రిటెన్షన్ జాబితాలో అలాంటిదేమీ జరగలేదు. గత సీజన్‌లో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లను వదులుకోలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితా విడుదల చేసింది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సహా మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లతో పాటు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకుంది. వీరిలో హెన్రిచ్ క్లాసెన్‌ను అత్యధిక ధరకు రిటైన్ చేసుకుంది. ఏకంగా 23 కోట్లకు ఈ విదేశీ ఆటగాడిని అట్టే ఉంచుకుంది. మిగిలిన ఆటగాళ్ల ధరల్లో కాస్త మార్పులున్నాయి. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద ప్రస్తుతం ఇంకా 45 కోట్లు మిగిలున్నాయి. ఈ డబ్బుతోనే వేలంలో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవల్సి ఉంటుంది. పాట్ కమిన్స్ 18 కోట్లకు రిటైన్ కాగా, అభిషేక్ శర్మ ఏకంగా 14 కోట్లు దక్కించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు దక్కించుకున్నాడు. కావ్య పాప ఈ ఐదుగురిపై విపరీతమైన నమ్మకం పెట్టుకుంది. 

Also read: IPL Retention: రిటైన్‌లో ఐపీఎల్‌ జట్లు సంచలనం.. అట్టి పెట్టుకున్న ప్లేయర్ల జాబితా ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News