Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్.. సీరియస్ అయిన రంగనాథ్.. అదుపులోకి నిందితుడు..

Hydra Ranganath: హైడ్రా పేరుతో కొంత మంది అక్రమ వసూళ్ల దందాలకు తెరలేపారని కూడా కమిషనర్ రంగనాథ్ కు పలు ఫిర్యాదులు అందాయి.దీంతో ఆయన దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 4, 2024, 12:10 PM IST
  • హైడ్రా పేరుతో వసూళ్ల దందా..
  • స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రంగనాథ్..
Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్.. సీరియస్ అయిన రంగనాథ్.. అదుపులోకి నిందితుడు..

ranganath serious on collection bribe on the name of hydra: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా పేరు హల్ చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం.. హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా.. చెరువులు, ప్రభుత్వాలకు చెందిన ప్రాంతాలను కాపాడటమే టార్గెట్ గా చేసుకుని, హైడ్రా చర్యలు చేపట్టింది. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను.. కమిషనర్ గా నియమించారు. ఇదిలా ఉండగా.. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో  అక్రమనిర్మాణాల కూల్చివేతల్ని చేపట్టింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం.. హైడ్రాను  జిల్లాలకు కూడా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా, దీనిపై దృష్టి సారించాలని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్నిఒత్తిడులు వచ్చిన కూడా... హైడ్రా తన పని తానుచేసుకుంటూ ముందుకు వెళ్తుంది.ఈ క్రమంలో హైడ్రా పేరుతో... కొంత మంది అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని కూడా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

కొన్నిరోజులుగా ట్రైసీటీస్ లోని కొంత మంది హైడ్రా ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా అధికారులు తమకు తెలుసని, రంగనాథ్ తమకు చాలా క్లోజ్ అని చెప్పి మరీ, అక్రమ నిర్మాణ దారుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. అంతేకాకుండా.. మీ నిర్మాణం కూలకూడదంటే.. తాము చెప్పినంత ముట్ట చెప్పాలని కూడా కొంత మంది అక్రమార్కులు వసూళ్లకు తెరలేపారంట.ఈ  ఘటనలు కాస్త హైడ్రారంగనాథ్ వరకు వెళ్లాయి. దీంతో  ఆయన సీరియస్ అయ్యారు. ఇలాంటి వాటిపట్ల ఊరుకునేది లేదంటూ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

హైడ్రా పేరుతో అక్రమాలకు పాల్పడితే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. అలాగే.. ఇతర ప్రభుత్వ విభాగలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతొ బెదిరింపులకు  పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే  ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ, ఎస్పీ, సీపీలకు లేదా  హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందని.. ఇలాంటి వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలుంటాయని కూడా చెప్పారు. 

హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ 

హైడ్రా పేరుతో..  సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం రోజున హైడ్రా కమిషనర్ కలుసుకొని ఫిర్యాదు చేశాడు. బిల్డర్లను  బెదిరించిన విప్లవ్ కుమార్.. 20 లక్షలు రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.  

Read more: Schools Holiday: మళ్లీ కుండపోత వానలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు వరుసగా ఐదురోజులు సెలవులు..డిటెయిల్స్ ఇవే..

ఈ ఫిర్యాదును పరిశీలించిన  అధికారులు.. హైడ్రా కమిషనర్ సూచనల మేరకు  ఎస్పీ సంగారెడ్డి  బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News