Malvika Sharma: బోలెడంత గ్లామర్ ఉన్న కాలం కలిసి రాని మాళవిక శర్మ.. ఆ సినిమాపైనే హోప్స్..

Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది కథానాయికలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ గా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

 

1 /6

మాళవిక శర్మ మహారాష్ట్రకు చెందిన ఈమె మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో  వెండితెరకు పరిచయం అయింది.  ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాలేదు. మాస్ మహారాజ్ తో యాక్ట్ చేసిన ‘నేల టిక్కెట్టు మూవీలో బాక్సాఫీస్ దగ్గ డిజాస్టర్ అయినా.. ఇందులో మాళవిక అందాలకు ఆడియన్స్  ఫిదా అయ్యారు.

2 /6

మాళవిక శర్మ విషయానికొస్తే.. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది. తెలుగులో నేల టిక్కెట్టు తర్వాత రామ్ పోతినేని సరసన 'రెడ్' మూవీలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.  

3 /6

అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' మూవీతో పలకరించింది. ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. త్వరలో విజయ్ ‘గోట్’ (Greatest Of All Time)మూవీతో పలకరించబోతుంది.

4 /6

రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా'లో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈమె నటి కాక ముందు పలు ఉత్పత్తులకు మోడల్ గా పనిచేసింది. 2017లో హిమాలయా, డెటాల్‌, మలబార్ వంటి కొన్ని టీవీ యాడ్స్ లో కనిపించింది.

5 /6

మాళవిక పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ న్యాయవాది కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.  

6 /6

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగిస్తోంది.