Bank of Baroda Loan EMI : భారతదేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా..తన బ్యాంకులో లోన్స్ తీసుకున్న కస్టమర్లకు భారీ షాకిచ్చింది. లెండింగ్ రేట్లను 5 బెసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ పెరుగుదల 3 నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్న వారికి వర్తిస్తుంది. ఈ పెరుగుదల సోమవారం ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ను రివ్యూ లేదా మార్చేసింది. ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానున్నట్లు బ్యాంకు పేర్కొంది. బ్యాంకుల్లో లోన్లపై విధించే కనీస వడ్డీరేటును ఎంసీఎల్ఆర్ అంటారు. దీన్ని మార్చడం వల్ల లోన్లు పై వడ్డీ రేట్లు పెరుగుతాయి లేదంటే తగ్గుతాయి.
ఇక ఫైలింగ్ ప్రకారం చూస్తే బ్యాంక్ మూడు నెలులు ఎంసీఎల్ఆర్ ను 8.50శానికి పెంచింది. అంతకుముందు ఇది 8.45 శాతం. 6-నెలల MCLR 8.75 శాతం (ముందుగా 8.70 శాతం),ఏడాది MCLR 8.90 శాతం (ముందుగా 8.95 శాతం) పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి పదవీకాలానికి వడ్డీ రేట్లలో 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలను చూసింది. అయితే ఓవర్‌నైట్ MCLR 8.15% వద్ద ఉంది. 1-నెల MCLR 8.35 శాతానికి పెంచారు. ప్రముఖ ప్రైవేట్ రంగా బ్యాంకు అయిన కెనరా బ్యాంకు కూడా 5శాతం బేసిస్ పాయింట్ల మేర లోన్ వడ్డీ రేట్లు పెంచేసింది. మూడు నెలల నుంచి మూడేండ్ల వరకు లోన్ టెన్యూర్లపై ఈ కొత్త రేటు వర్తిస్తుంది.
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా 1 నెల ఎంసీఎల్ఆర్ పై వడ్డీ రేట్లను మార్చలేదు. ఎంసీఎల్ఆర్ ను ఆర్బీఐ పరిచయం చేసింది. ఈ రేట్లను బట్టి బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు ఎంత వడ్డీ వసూలు చేయాలో నిర్ణయం తీసుకుంటాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక రకంగా కనీస వడ్డీ రేటు లాంటిదని చెప్పవచ్చు. మార్కెట్ పరిస్ధితులను బట్టి ఈ రేటు మారుతుంది. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీరేటుకు లోన్స్ ఇవ్వవు. ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన ఆర్బీఐ మానిటరీ పాలసీలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను యథాతధంగా కొనసాగిస్తూ..నిర్ణయం తీసుకుంది.
దీంతో కీలక వడ్డీ రేట్లు పెరగడం లేదు. ఒకవేళ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినట్లయితే అప్పుడు కస్టమర్లకు తక్కువ వడ్డీలకే రుణాలు లభిస్తాయి. ఒకవేళ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే మాత్రం రుణాలపై వడ్డీ రేట్లు ఆటోమెటిగ్గా పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంకులు రెపో లింక్డ్ లోన్ రేట్ (RLLR)ఆధారంగా రుణాలను అందిస్తున్నాయి. ఫలితంగా నేరుగా ఆర్బీఐ తీసుకునే కీలక వడ్దీ నిర్ణయాలపై మీరు తీసుకునే రుణం ఆధారపడి ఉంటుంది.
Also Read : Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి