BRS BJP Merge News: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వెళ్లిపోతుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. కోర్టులు మాత్రం నిరాకరిస్తున్నాయి. ఇక తాజాగా బీజేపీలో బీఆర్ఎస్లో విలీనం అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి విలీనం పొత్తులు, ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలను ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Also Read: Bithiri Sathi Controversy: వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు..
బీఆర్ఎస్ పార్టీపైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని కేటీఆర్ స్పష్టం చేశారు. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదన్నారు. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకుని.. అభివృద్ధిలో అగ్రపథాన నిలిపామని అన్నారు.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకుని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని కేటీఆర్ అన్నారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాం కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలని హితవు పలికారు. పడతాం.. లేస్తం.. తెలంగాణ కోసమే పోరాడుతామని.. కానీ తలవంచమన్నారు.
"గతంలో టీఆర్ఎస్గా ప్రస్తుతం బీఆర్ఎస్గా ఉన్న ఈ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కానుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర. బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది. ఇది పుకారు కాదు. కల్పిత కథ అంతకన్నా కాదు. ఢిల్లీ ఎన్నికల్లోపే విలీనం ప్రక్రియ ఓ కొలిక్కి రానుంది. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన ప్రక్రియ పూర్తి కానుంది..." అంటూ ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన విషయం తెలిసిదే.
Also Read: Bithiri Sathi Controversy: వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.