Banks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డిసెంబర్ నుంచి వారానికి 5 రోజులే

5 Day Week for Banks: బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు ఇరువురికీ కీలకమైన అప్‌డేట్ ఇది. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఎట్టకేలకు అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 14, 2024, 06:05 PM IST
Banks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డిసెంబర్ నుంచి వారానికి 5 రోజులే

5 Day Week for Banks: వివిధ ప్రైవేట్ సంస్థలు, కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లో ఉన్న వీక్లీ 5 డేస్ సిస్టమ్ కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పట్నించో కోరుతున్నారు. బ్యాంకు అసోసియేషన్, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందం పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది చివరికి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. 

బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజుల పని దినాల కోసం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాలకు మధ్య ఒప్పందం కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలింది కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదమే. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాల మధ్య గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో ఒప్పందం జరిగింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది చివరికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని తెలుస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ ఈ ఏడాది మార్చ్ 8వ తేదీన ఒప్పందాన్ని నిర్ధారిస్తూ జాయింట్ నోట్ కూడా విడుదల చేశాయి. 

తుది నిర్ణయంలో రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఆ సమయంలో బ్యాంకింగ్ పని వేళలు, ఇంటర్నల్ ఆపరేషన్లు నిర్ణయిస్తారు. కస్టమర్ల సేవల విషయంలో ఎలాంటి కోత ఉండదు. రోజువారీ పని దినాలు 40 నిమిషాలు అదనంగా పొడిగించి వారానికి 5 రోజుల పనిదినాలు ప్రారంభిస్తారు. వారానికి ఐదు రోజుల పని దినాలుప్రారంభమైతే ఉదయం 9.45 గంటలకు బ్యాంకులు తెర్చుకుని సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయి. 

వారానికి ఐదు రోజుల పనిదినాలకు అనుమతి లభించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే నెలలో రెండు వారాలు వారానికి ఐదురోజులే ఉంటోంది. ప్రతి ఆదివారం సెలవు ఎలాగూ ఉంటోంది. అది కాకుండా రెండవ, నాలుగవ శనివారాలు సెలవులుంటున్నాయి. అంటే ఇక చేయాల్సింది 1వ, మూడవ శనివారాలు కూడా సెలవిస్తే సరిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపితే ఆర్బీఐ నెగోషయెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం నెలలోని నాలుగు శనివారాలు కూడా అధికారికంగా సెలవులవుతాయి. 

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల షెడ్యూల్ అనేది ప్రభుత్వం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. కొత్త షెడ్యూల్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా ఉంది. ఏకంగా పదేళ్ల నుంచి బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినాల కోసం డిమాండ్ చేస్తున్నారు. 

Also read: Cholesterol Control Fruits: ఆ 5 పర్పుల్ రంగు పండ్లు తింటే కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News