Suicide Live Video: వీడియో చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. కళ్లు బరువెక్కి చెమర్చుతాయి. మనసులో దాచుకున్న బాధ, కష్టాలు ఆ ఇద్దరినీ అంతటి కఠోన నిర్ణయం తీసుకునేలా చేశాయి. అలా నడుచుకుంటూ వెళ్లి పక్క ట్రాక్‌పై వస్తున్న లోకల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్లో జరిగిన అత్యంత హృదయ విదారక దృశ్యమిది.
ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్ ఇది. లోకల్ రైళ్లు ఎక్కువగా నడిచే స్టేషన్. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. పక్క నుంచి ఓ లోకల్ ట్రైన్ వెళ్తోంది. 6వ నెంబర్ ప్లాట్‌ఫామ్ అది. ఇద్దరిలో ఒకడు యువకుడు. వెనుక బ్యాక్‌ప్యాక్ తగిలించుకున్నాడు. మరొకరు మధ్య వయస్సు లేదా అంతకుమించి వయస్సు కలిగిన వ్యక్తి. టీ షర్ట్ ప్యాంట్ షూ వేసుకున్నాడు. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ వెళ్లారు. లోకల్ ట్రైన్ దాటి వెళ్లాక ట్రాక్ దాటారు.
పక్క ట్రాక్‌పై మరో లోకల్ ట్రైన్ ఎదురుగా వస్తోంది. అది చూసి ముందు ఇటువైపున్న ట్రాక్ పైకి వెళ్లారు. ఇద్దరూ కొన్ని సెకన్లు చర్చించుకున్నట్టు లేదా
సంశయం పడినట్టుగా అర్ధమౌతోంది. ఇద్దరూ చేయి పట్టుకుని లోకల్ ట్రైన్ వస్తున్న ట్రాక్‌పైకి వచ్చి అడ్డంగా పడుకుండి పోయారు. అంతే సెకన్ల వ్యవధిలో జరగడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి పేరు హరీష్ మెహతా కాగా కొడుకు పేరు జై మెహతాగా గుర్తించారు. విరార్ నుంచి చర్చ్ గేట్ వెళ్తున్న లోకల్ ట్రైల్ కింద పడి ప్రాణాలు తీసుకున్న ఈ ఇద్దరూ వసాయ్ ప్రాంతీయులుగా తెలుస్తోంది.
भाईंदर रेल्वे स्थानकाजवळ पिता पुत्राने धावत्या लोकल ट्रेनखाली उडी मारून आत्महत्या गेली. सोमवारी सकाळी साडेअकराच्या सुमारास ही घटना घडली. हरिष मेहता (६०) आणि जय मेहता (३०) अशी त्यांची नावे आहेत. त्यांनी आत्महत्या का केली याचा तपास वसई रेल्वे पोलीस करत आहेत. pic.twitter.com/kzXtPPWbHa
— LoksattaLive (@LoksattaLive) July 9, 2024
వీడియో చూస్తుంటే అసలు ఎలాంటి అనుమానం రాదు. ఇద్దరూ తాపీగానే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 2 నిమిషాలున్న ఈ వీడియోలో చివరి 10-15 సెకన్లు తప్పించి ఎక్కడా ఎలాంటి సందేహం కలగదు వీడియో చూస్తుంటే. లైవ్‌లో రికార్డ్ అయిన తండ్రీ కొడుకుల ఆత్మహత్య వీడియో వైరల్ అవుతోంది.
Also read: TOP CNG Cars: 10 లక్షల్లోపు ధరలో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook