KTR Comments on YS Jagan: తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వడం.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు వరకు తిరుగులేదని అనుకున్న గులాబీ పార్టీ.. రిజల్ట్స్‌తో ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలతో అయినా తిరిగి పుంజుకుందామని అనుకున్నా.. ఒక్కసీటు కూడా గెలుచులేకపోవడం చావు దెబ్బ తిన్నట్లయింది. ప్రస్తుతం పార్టీ క్యాడర్లో పునరుత్తేజం నింపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌లో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఓటమి, ఏపీలో జగన్ ఓటమిపై చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.
Also Read: Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగింగంటే..?
ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందన్నారు కేటీఆర్. తాము వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రజలది తప్పు అనడమం కంటే.. తమదే తప్పు అని ఒప్పుకున్నారు. హైదారాబాద్‌లో అన్ని సీట్లు గెలిచామని.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ.. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా.. జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైసీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి కూడా ఓడిపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక పావులా ఉపయోగించారని.. అంతకు మించి షర్మిల ఏమీ లేదన్నారు.
తెలంగాణలో సంచులతో దొరికినవాడు సీఎం అయ్యాడని.. తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని కేటీఆర్ అన్నారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదని.. అభివృద్ధిలో తమన పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఫిరాయింపుల వల్ల తమ లాభం జరగలేదని ఒప్పుకున్నారు. తమ పార్టీలో చేరిన వారిలో పది మంది ఓడిపోయారని అన్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని.. పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Abhishek Sharma Love Story: టీమ్ ఓనర్‌తోనే అభిషేక్ శర్మ డేటింగ్..? ట్రెండింగ్‌లో ఉన్న ఆమె ఎవరంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి