IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..

TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 24, 2024, 06:12 PM IST
  • లోటస్ పాండ్ లో జగన్ అక్రమ నిర్మాణం కూల్చివేత..
  • ఐఏఎస్ ల బదిలీల్లో ప్రమోషన్..
IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..

IAS Hemant Promotion who demolished the illegal congstuction in lotuspond: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన దైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల పథకాలను తెలంగాణలో అమలుచేస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలను ఎదుర్కొంటునే మరోవైపు పాలనలో కూడా దూసుకుపోతున్నారు. ప్రజలకు మంచి పథకాలు, పాలన అందాలంటూ సమర్థవంతమైన అధికారులు ఆయా శాఖాల్లో ఉండాలి. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన అధికారులను పక్కన పెట్టారు. అదే విధంగా డైనమిక్ అధికారులకు  కీలక బాధ్యతలు అప్పగించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ ఉత్తర్వులు జారీచేశారు.దీనిలో కొందరికి ప్రమోషన్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు ఐఏఎస్ అధికారులు ఈ నేపథ్యంలో వార్తలలో నిలిచారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. డైనమిక్ అధికారిణి ఆమ్రాపాలి ప్రత్యేకంగా కలిసి విషేస్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల బదిలీలలో ఆమ్రాపాలికి.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. మరో ఐఏఎస్ అధికారి కూడా ఇప్పుడు వార్తలలో నిలిచారు.

లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ పై  సర్కారు సీరియస్ అయ్యింది. ఆయన కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా.. కూల్చివేతలకు ఆదేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఐఏఎస్ ఆమ్రాపాలీ కూడా సీరియస్ గా స్పందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక మరోవైపు తాజాగా, తెలంగాణలో చేసిన ఐఏఎస్ ల ట్రాన్స్ ఫర్ లలో .. హేమంత్ కు ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖైరతాబాద్ జోనల్ కమిషన్ గా హేమంత్ పనిచేశారు.

జగన్ ఇల్లు ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా మాకు తెలీకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకు TSMSIDC (Telangana State Medical Services & Infrastructure Development Corporation) కు ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి హేమంత్ మరోసారి వార్తలలో నిలిచారు. 

Read more: Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News