Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయ చిత్ర పరిశ్రమలో నటనకు ఓ పర్యాయ పదం. పాత్ర ఏదైనా.. అదే కనపడుతోంది కానీ ఆయన కనపడదు. అంతేకాదు 1980 దశకంలోనే ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చూపెట్టారు. అప్పట్లో తమిళం, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో మార్కెట్ ఉన్న స్టార్ హీరోగా కమల్ హాసన్ వార్తల్లో నిలిచారు.ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పటిలా తెలుగు సహా ఇతర భాషల్లో కమల్ హాసన్ మార్కెట్ పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయినా.. ఓవరాల్ గా రూ. 15 కోట్ల వరకే కలెక్ట్ చేసింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది. ఒక్క తమిళంలోనే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన 60 యేళ్లకు పైగా వయసులో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోగా నిలిచాడు.
‘విక్రమ్’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చేసాడు. అపుడెపుడు 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు కూడా ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. అప్పట్లో ఏ.ఆర్.రెహమాన్ అందించిన పాటలతో సగం సక్సెస్ అయింది భారతీయుడు. అప్పటికే ఈ సబ్జెక్ట్ అందరికీ కొత్త కావడం.. కమల్ హాసన్ ఇమేజ్ ఆకాశంత ఉండటం.. డైరెక్టర్ గా శంకర్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు అప్పట్లో కాసులు వర్షం కురిపించాయి.
కానీ తాజాగా తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీపై తమిళంలో తప్ప ఎక్కడా ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనపడటం లేదు. జూలై 12న విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాకు.. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తి కాలేదు. వీళ్లు చెబుతున్న రేటు కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. గతంలో లాగా కమల్ హాసన్ మార్కెట్ తెలుగులో అంతగా లేదు. విక్రమ్ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ ఇమేజ్ కూడా తోడ్పడింది. మరోవైపు హిందీలో ఈ సినిమాను రూ. 18 కోట్ల అడ్వాన్స్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కావాలంటే అక్కడ దాదాపు రూ. 40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాలి. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే ఈ సినిమాకు యూనిమస్ టాక్ రావాల్సిందే. ఏదైనా తేడా కొట్టిందో అంతే సంగతులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook