Tollywood Movies 2024: తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచమంతా గెలిచి వచ్చిన.. సొంత ఇంట్లో గెలవలేకపోయారు అన్నట్టు.. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయంలో ఎన్నో బాధలు పడ్డారు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పడిన బాధ.. అసలు మన పగవాడు కూడా పడకూడదు అనేటట్టు ఉండింది. మీడియా ముందుకి వచ్చి చెప్పలేకపోయినా.. తెలుగు సినిమాలో ప్రతి హీరో ఏదో ఒక విధంగా.. గత గవర్నమెంట్ తో తమ సినిమాల విషయంలో చిక్కుల్లో ఇరుక్కున్న వాళ్లే ఉన్నారు. ఎన్నో సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలు టికెట్..హైక్స్ లేకుండా చేసింది వైసిపి గవర్నమెంట్. ఆఖరికి ఇదే విషయంపై చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు జగన్ ని పోయి పర్సనల్ గా కలిసిన పెద్దగా లాభం లేకుండా పోయింది. అన్ని దగ్గర్లో టికెట్ రేట్లు భారీగా ఉన్న.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు తక్కువగానే ఉంచారు. ఈ క్రమంలో కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన చిత్రాలు కూడా కొన్ని.. తెలుగు రాష్ట్రాల వరకు కేవలం యవరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. ముఖ్యంగా కొద్దిమంది హీరోల సినిమాల విషయంలో.. అప్పట్లో జగన్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు బాధాకరమని నటిజన్స్ కామెంట్స్ కూడా పెట్టసాగారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలలో.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నట్లు వినికిడి. అందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు సినిమా వారికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు. గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా.. సినిమా వారి విషయంలో ఎప్పుడూ చంద్రబాబు నాయుడుకి విభేదాలు రాలేదు. ఇక మరోపక్క జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్..టాలీవుడ్ కి పవర్ స్టార్ కావడం మరో విశేషం.
మరి చంద్రబాబు నాయుడు… పవన్ కళ్యాణ్ పదవిలో ఉండగా టాలీవుడ్ ని ఆపేది ఇక ఎవరు అంటున్నారు అందరూ. చంద్రబాబు, పవన్ తప్పకుండా టాలీవుడ్ సినిమాలకు ఎంతో సహాయకంగా ఉంటారని.. ముఖ్యంగా సినిమాలకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ ల విషయంలో అనుకూలంగా ప్రవర్తిస్తారు అని గట్టి నమ్మకంతో ఉన్నారట తెలుగు నిర్మాతలు.
మొత్తం పైన టాలీవుడ్ లో పరిస్థితి.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఈరోజు నుంచి ఒక లెక్క అన్నట్టు ఉండటం ఖాయం అని అంటున్నారు అందరూ. అంతేకాకుండా ఇక టాలీవుడ్ రాట మారిపోయినట్టే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది నేటిజన్స్.
Also Read: Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?
Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్ పే నంబర్ అంటూ పిచ్చి రాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter