బాక్సిండే టెస్టు సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్ భారీ స్కోర్ చేసింది. రెండో రోజు 215 పరుగు ఓవైర్ నైట్ స్కోర్ తో బరిలోకి దిగిన కోహ్లీసేన మరో 229 పరుగులు జోడించింది. దీంతో మొత్తం 169.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి టీమిండియా 443 పరుగుల చేసింది.
బ్యాటింగ్ విషయానికి వస్తే ఇండియన్ వాల్ గా పిలవబడే పుజారా మరో సారి సెంచరీతో (106) కద్దం తొక్కాడు. 82 పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ.. పుజారాకు చక్కటి సహకారం అందించాడు. ఇరువురి భాగ్యస్వామ్యం కారణంగా భారత్ కు బారీ స్కోర్ బాటలు పట్టాయి. వారి తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్లపై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో చక చక పరుగులు సాధించినప్పటికీ అదే స్థాయిలో వికెట్లు పడ్డాయి. మిడిల్ ఆర్డర్ లో దిగిన రోహిత్ శర్మ (63), రెహానే (34) వికెట్ కిపర్ రిషబ్ పంత్ (39) పరుగులు చేసి భారీ స్కోర్ లో తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు యువ ఓపెనర్ విహారీ 8 పరుగులకే ఓట్ కాగా మరో ఓపెనర్ అగర్వాల్ 76 పరుగులతో రాణించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ టీమిండియా బ్యాట్స్ మెన్లు సమిష్ఠిగా రాణించడం వల్లే భారత్ కు 446 పరుగుల భారీ స్కోర్ సాధ్యపడింది.
ఆసీస్ బౌలింగ్ విషయానికి వస్తే ఫేసర్లు కమ్మింన్స్ 3 వికెట్లు, స్ట్రాస్ 2 వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు హాజిల్ వుడ్, లియాన్ లు చెరో ఒక వికెట్ పడగొట్టారు. ఆసీస్ బౌలర్లు లేటుగా తేరుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా భారత్ భారీ స్కోర్ సాధించి విజయానికి బాటలు వేసుకొంది. దీనికి ఆసీస్ బ్యాట్స్ మెన్లు ఏ విధంగా సమాధానం చెబుతారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం ఆసీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది
India vs Australia : విజయానికి బాటలు వేసుకున్న కోహ్లీసేన