Hair Growth Oil: ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
బాదం నూనె..
బాదం నూనె కూడా ఒక సహజ సిద్ధమైన నూనె ఇందులో విటమిన్, ప్రోటీన్స్, ట్రోకోఫెరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. ఇది బెస్ట్ హెయిర్ ఆయిల్ చూడ్డానికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది త్వరగా మన హెయిర్ గ్రహిస్తుంది ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఆముదం నూనె..
ఈ ఆముదంను నేను తరతరాలుగా ఉపయోగిస్తున్నారు ఇది మంచి హెయిర్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు ఏళ్లుగా ఈ ఆయిల్‌ను వినియోగిస్తారు. ఇది జుట్టు కుదుళ్లను కూడా ఆరోగ్యపరుస్తుంది. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఆముదం నూనెలో రైసినోలెనిక్ ఆసిడ్ ఉంటుంది జుట్టు దురద రాకుండా కాపాడుతుంది.
కొబ్బరి నూనె..
ఇది రెగ్యులర్ గా మనందరి ఇళ్ళలో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె జుట్టును మందంగా చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మాయిశ్చర్ గా ఉంచుతుంది పోషణకు సహాయపడుతుంది.
గ్రేప్ సీడ్ ఆయిల్..
ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ ని గ్రేప్స్ నుంచి తయారుచేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఇది లివిన్ కండిషనర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కుదుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇదీ చదవండి: జీరో ఆయిల్ సోయా బిర్యానీ.. రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి?
ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్ లో కూడా అంటో ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు మంచి కండిషన్ గిస్తే జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో ఒలియోక్ యాసిడ్, విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
పెప్మర్మెంట్ ఆయిల్..
ఇది ఎంతో ముఖ్యమైన ఎసెన్షియల్ ఆయిల్ .జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. హెయిర్ పోలికల్స్ ను సైతం బలపరుస్తుంది.
ఇదీ చదవండి:ఈ ఎండలకు ఏసీతో పనిలేకుండా మీ ఇంటిని చల్లబరిచే 5 చిట్కాలు..
రోజు మేరీ ఆయిల్..
హెయిర్ ఆయిల్ తో జుట్టు ఒక మాజికల్ లాగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు రోజు మేరీ ఆయిల్స్ తోడ్పడతాయి ఇది హెయిర్ ఫాలికల్స్ ని పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. వీటి జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా బ్లడ్ సర్కులేషన్ అయ్యేలా మూలాలను బలపరుస్తుంది. డ్యాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది. వేరే ఇతర ఆయిల్స్ తో కలిపి జుట్టుకు అప్లై చేసుకుంటే డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook