Red Foods 10 Benefits: ఎర్రని పండ్లు కూరగాయలు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటా, స్ట్రాబెరీ, రెడ్ బెల్‌పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు 10 ఆరోగ్య ప్రయోజనాలకు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం
ఇమ్యూనిటీ..
ఎర్రని పండ్లు కూరగాయల్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా నివారిస్తాయి.
హైడ్రేషన్..
ఎండాకాలంలో ఎర్రని పండ్లు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల రోజంతటికి కావలసిన హైడ్రేషన్ మన శరీరానికి అందిస్తుంది
బరువునిర్వహణ..
ఎరుపు రంగులో ఉండే పండ్లను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎర్రని పండ్లతో కూరగాయలతో బరువు పెరగకుండా ఉంటాము ఇది ఒబెసిటీ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
బ్లడ్ షుగర్..
ఎరుపు రంగులో ఉండే పండ్లు కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు మితంగా ఉంటాయి పెరగకుండా కాపాడుతుంది డయాబెటిస్ ప్రమాదం రాకుండా ఉంటుంది.
ఎముక ఆరోగ్యం..
ఇలాంటి ఆహారాలు మన ఫుడ్ లో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలంగా దృఢంగా మారుతాయి ఇందులో విటమిన్ కె క్యాల్షియం, వంటి ఖనిజాలు ఉంటాయి ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మూడ్..
ఎరుపు రంగు ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మూడ్ బూస్ట్ అవుతుంది దీంతో మనం మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..
ఎరుపురంగులో ఉండే పండ్లు కూరగాయలు ప్రతిరోజు తినడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లైకోపీన్ అంతోసినాయిన్స్ ఇవి మన శరీరానికి ఇన్ల్పమేషన్ సమస్య రాకుండా కాపాడుతాయి.
ఇదీ చదవండి: ఈ 5 సూపర్ ఫుడ్స్ పాడైన లివర్‌ను సైతం బాగుచేస్తాయట..!
చర్మఆరోగ్యం..
ఎరుపు రంగు పండ్లు కూరగాయలతో మన ముఖం పై గ్లో పెరుగుతుంది ముఖంపై యాక్నే, వాపు సమస్యలు రాకుండా కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
స్ట్రోక్..
ఎరుపు రంగు ఆహారాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్ రాకుండా ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతాయి.
ఇదీ చదవండి: ఈ చేప తింటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ జాడే ఉండదు..!
కాలేయ ఆరోగ్యం..
ఇలాంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా డీటాక్స్ఫికేషన్ ప్రాసెస్ లో ప్రేరేపిస్తాయి రెడ్ కలర్ ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యకరంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter