Delhi Police Notices to CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసిన వీడియోకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన ఐదుగురు వ్యక్తులతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించరు. సీఎం కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారని తెలుస్తోంది. వివరణ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మే 1వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫోన్ సమర్పించాలని కోరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా ఉన్నందున ఢిల్లీ పోలీసులు రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
Also Read: Lakhimpur Horror: ఇదేం పైశాచికం.. ప్రియురాలి ముఖంపై రాడ్డుతో పేరు రాసి.. ఆ తర్వాత..
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను రద్దు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. తెలంగాణలో ముస్లింలకు "రాజ్యాంగ విరుద్ధమైన" రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినట్లు వీడియోను మార్ఫింగ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాలను రద్దు చేయాలని చెప్పినట్లు వైరల్ అవుతున్న వీడియోలో ఉంది. ఈ వీడియో మార్ఫింగ్ అని బీజేపీ కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన అసలు వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఈ వీడియోపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమిత్ షా ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆ తరువాత చాలా మంది పార్టీ నాయకులు రీట్వీట్ చేస్తూ.. వీడియోను వైరల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులకు బీజేపీ, హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన అకౌంట్‌ల సమాచారాన్ని కోరుతూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌కి నోటీసులు పంపించారు. ఈ మేరకు సమాచారం తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అమిత్ షా చేసిన అసలు ప్రకటలను వక్రీకరించేందుకు ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, పోలీసుల కేసు నమోదు
Also Read: YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter