Summer Heat Stroke:మీ బాడీలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Summer Body Dehydration: సమ్మర్ లో చాలా మంది ఒక్కసారిగా నీరసంగా మారిపోతుంటారు. వడదెబ్బ అనేది బైటకు వెళ్లిన వారిలో నే కాదు. ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా కల్గుతుంది. అందుకే ఇంట్లో ఉన్న కూడా అలర్ట్  గా ఉండాలి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2024, 11:47 AM IST
  • దంచికొడుతున్న ఎండలు..
  • వడదెబ్బ తగిలితే ఇలా చేయాలంటున్న నిపుణులు..
Summer Heat Stroke:మీ బాడీలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Summer heat stroke dehydrations effect symptoms: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అధికారలుకూడా అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అనేక సూచనలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భానుడి ప్రతాపంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కొందరు బైటకు వెళ్లిన వారు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. వీరికి వడదెబ్బ తగిలిందని వారికే తెలియదు. అందుకే వడదెబ్బ తగిలితే  ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More: Almonds: బాదంపప్పు అసలైనదా..?.. నకిలీదా..? ఈ సింపుల్ టిప్స్ తో తెలుసుకోవచ్చు..

వడదెబ్బ సింప్టమ్స్:

ఎండలో బైటకు వెళ్లిన వారు ఎక్కువగా వడదెబ్బకు గురౌతుంటారు. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగకుండా, గొడుగు, టోపీలు పెట్టుకోకుండా ఎండలో తిరిగే వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారిలో.. మొదటగా.. కళ్లముందు ఒక్కసారిగా చీకటి వచ్చేస్తుంది. నాలుక తడారి పోతుంది. చేతులు కాళ్లు వణుకుతుంటాయి. తల తిరుగుతున్నట్లు ఉంటుంది. ఒక్కసారిగా కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మరికొందరికి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు, కాళ్లు కొందరిలో వంకరపోవడం జరుగుతుంది. మరికొందరిలో లూస్ మోషన్స్ కూడా అవుతాయి. చేతి ఇలాంటి సింప్టమ్ లు కన్పిస్తే వెంటనే అలర్ట్ అయిపోవాలి.

వడదెబ్బకు టీట్మెంట్ : 

వడదెబ్బ ఎవరికైన తగలాగానే.. వెంటనే వారిని నీడలోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా వారి ఒంటి మీద ఉన్న దుస్తులను తీసేయాలి. గాలి ఆడేలా చేయాలి. చల్లని నీళ్లలో ఒక బట్టను ముంచి శరీరం అంతట తుడవాలి. చల్లని గాలి వారి శరీరానికి తాకేలా చేయాలి, వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం ను తాగించాలి, దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి. నిమ్మరసంను తాగించాలి.

Read More: Summer Heat: భగ్గుముంటున్న ఎండలు.. బైటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నిపుణుల సూచనలివే..

సమ్మర్ లో చేయకూడని పనులు :

ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో పెద్దవాళ్లు, చిన్నారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పదినుంచి సాయంత్రం నాలుగు వరకు బైటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. తరచుగా నిమ్మరసం, ఫ్రూట్ జ్యూస్ లు తాగుతుండాలి. పెద్దవాళ్లు, చిన్న పిల్లలు ఎండలో ఎక్స్ పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. టైమ్ కు తింటు ఉండాలి. దాహాం వేయకున్న కూడా నీళ్లను ఎక్కువగా తాగుతుండాలి. ఓఆర్ఎస్ ద్రావణం, నిమ్మసోడా, షర్బత్ లు ఎక్కువగా తాగుతుండాలి. 

ఎండాకాలంలో ఉపవాసాలు చేయడం మానుకోవాలి.డైలీ ప్రపర్ గా ఫుడ్ తీసుకొవాలి. సమ్మర్ లో ఎక్కువగా ఎక్సర్ సైజ్ లు చేయకూడదు. వదులుగా ఉండే దుస్తులు వేసుకొవాలి. ఉదయం, రాత్రికి రెండు సార్లు స్నానం చేయాలి. ఏమాత్రం శరీంరంలో మార్పులు వచ్చిన వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లిపోవాలి. ఇంట్లో కూలర్ లు లేదా ఏసీలు వాడితే కాస్తంతా ఉపశమనం ఉంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News