Belly Fat: అతి చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ రావడం ప్రస్తుతం చాలామందిలో ప్రధాన సమస్యగా మారింది. బెల్లీ ఫ్యాట్ కారణంగా యంగ్ గా ఉన్నప్పటికీ కొంతమంది అంకుల్స్ లా కనిపిస్తున్నారు. అలాగే దీని కారణంగా త్వరగా వయస్సు మళ్ళిన వారవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. నిజానికి వెళ్లి ఫ్యాట్ అనేది కొంతమందిలో ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల వస్తున్న సమస్య ఈ సమస్యకు సకాలంలో చెక్ పెట్టకపోతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో బెల్లీ ఫ్యాట్ కారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంత మంచిది. లేదంటే ఈ కింది సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బెల్లీ ఫ్యాట్ కారణంగా వచ్చే 5 ప్రధాన వ్యాధులు:
టైప్ 2 మధుమేహం:
బెల్లీ ఫ్యాట్ కారణంగా అనేక రకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోయి..కొవ్వు కణాలు శరీరం ఇన్సులిన్‌ను ప్రక్రియను అడ్డుకుంటాయి. దీనికి కారణంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు తప్పకుండా మధుమేహం రాకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
గుండె జబ్బులు:
బెల్లీ ఫ్యాట్ కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల్లో గుండె జబ్బు ఒకటి ఈ సమస్య కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మరికొంతమందిలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండడానికి బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించుకోవడం ఎంతో మంచిది.
క్యాన్సర్:
పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కణాలు కొన్ని రకాల క్యాన్సర్లకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో బెల్లీ ఫ్యాట్ కారణంగా పెద్దప్రేగు క్యాన్సర్, పాన్క్రియాటిక్ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు ఇలాంటిది ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉండడానికి పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆల్జీమర్స్ వ్యాధి:
పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కణాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆల్జీమర్స్ వ్యాధి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని సూచనలు సలహాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి