Mudra Loan Yojana: కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పధకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి ముద్ర యోజన. ఈ పథకం కింద ఆసక్తి కలిగిన ఆర్హులైన వ్యక్తులకు వ్యాపారం చేసుకునేందుకు 50 వేల నుంచి 10 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణం తీసుకునేందుకు ఏ విధమైన సెక్యూరిటీ లేదా కొల్లాటెరల్ సెక్యూరిటీ అవసరం లేదు. అలాంటి షరతుల్లేకుండానే రుణం మంజూరవుతుంది.
2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన ప్రదానమంత్రి ముద్ర యోజనలో రుణాలన్ని నాన్ కార్పొరేట్, నాన్ అగ్రికల్చర్ కావడం గమనార్హం. ఈ పథకంలో 50 వేల నుంచి 10 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. పీఎంఎంవై ప్రధానమంత్రి ముద్ర యోజన మూడు కేటగరీల్లో ఉంటుంది. మొదటిది శిషు లోన్. ఇందులో 50 వేల వరకూ రుణం లభిస్తుంది. రెండవది కిశోర్ లోన్..ఇందులో 5 లక్షల వరకూ రుణం లభిస్తుంది. మూడవది తరుణ్ లోన్..ఇందులో 10 లక్షల వరకూ రుణం లబించవచ్చు.
ప్రదానమంత్రి ముద్ర యోజనకు ఎవరు అర్హులు
ముందుగా కావల్సిన అర్హత భారత పౌరుడై ఉండాలి. దాంతో పాటు బ్యాంక్ డీఫాల్ట్ హిస్టరీ ఉండకూడదు. బ్యాంక్ ఎక్కౌంట్ తప్పనిసరిగా ఉండాలి. రుణం కోసం అప్లై చేసే వ్యక్తి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. ఈ పధకం కింద 50 వేల నుంచి 10 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ప్రోసెసింగ్ ఫీజు ఉండదు. రుణం చెల్లింపు కాలవ్యవధి 12 నెలల్నించి 5 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్లలోపు రుణం తిరిగి చెల్లించలేకుంటే మరి కొంతకాలం పొడిగించుకోవచ్చు. ఈ రుణంపై ఎలాంటి వడ్డీ ఉండదు.
ఆధార్ కార్డు, పాన్ కార్డు బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, ఐటీ రిటర్న్స్ కాపీ, సెల్ఫ్ ట్యాక్స్ రిటర్న్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరమౌతాయి. అధికారిక వెబ్‌సైట్ mudra.org.in.ద్వారా అప్లై చేయవచ్చు లేదా సమీపంలోని ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read: 7th Pay Commission: డీఏతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెంపు, ఒకేసారి 20,484 రూపాయలు లాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mudra Loan Yojana: బిజినెస్ లోన్ కోసం చూస్తున్నారా, ఇలా అప్లై చేయండి