Bhimaa movie 1st Week World Wide Box Office Collections: గోపీచంద్ హీరోగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక హిట్ దక్కిందనుకుటే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. దీంతో ఈయన మార్కెట్ రోజు రోజుకు కుచించుకుపోతుంది.కెరీర్ పరంగా వరుస డిజాస్టర్స్ ఉన్న తన కున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్‌లో హీరోగా సత్తా చూపెడుతునే ఉన్నాడు. మాస్ హీరో ఇమేజ్ గోపీచంద్‌కు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. కానీ అందకు తగ్గట్టు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడంలో తడబడుతున్నాడు. 'సీటీమార్' తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి 'పక్కా కమర్షియల్' మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన 'రామబాణం' సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులను ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఇపుడు కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్‌లో తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్‌లో 'భీమా' సినిమాతో ఈ మహా శివరాత్రి రోజున పలకరించాడు.
గౌతమ్ నంద తర్వాత గోపీచంద్ మరోసారి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసాడు. రామాగా.. భీమా రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో గోపీచంద్ మాస్ పోలీస్ రోల్ కారణంగా ఈ సినిమాను ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమా ఏరియా వైజ్ 7 రోజుల్లో రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
ఈ సినిమా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి తొలి రోజు.. రూ. 2.33 కోట్ల షేర్ (రూ. 4.25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
ఏడు రోజుల్లో కలిపి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.06 కోట్ల షేర్ ( రూ. 10.35 కోట్ల గ్రాస్) వసూళ్లను కొల్లగొట్టింది.
6.06CR~(10.35CR~ Gross)
ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.68 కోట్ల షేర్ (రూ. 11.95 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
భీమా మూవీ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 4.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ + ఓవర్సీస్ కలిపి రూ. 1.8 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 11.30 కోట్లు..
'బీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 12 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 6.68 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇంకా రూ. 5.32 కోట్లు రాబట్టాల్సి అవసరం ఉంది. ఈ టాక్‌తో ఈ సినిమా ఇక కోలుకోవడం కష్టమే అని చెప్పాలి.
అంతేకాదు చాలా రోజులు తర్వాత గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్లస్ అని భావించినా.. రొటిన్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అక్కడక్కడ ఆసక్తి గొలిపే అంశాలున్నా అవేమి ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించలేకపోయాయి. ఈ మూవీ శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ మూవీలో నాగ చైతన్య '7ధూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు మాళవిక శర్మ ఇంపార్టెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter