Hanu Man Director Prashanth Varma: ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు దర్శకుల హవా నడుస్తోంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాల తర్వాత హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగిపోతుంది. హనుమాన్ సినిమా సంచలన విజయం తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి బడా హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలయ్య, చిరంజీవిలతో సినిమాలు చేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ కోవలో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్లో రణ్‌బీర్ సింగ్‌తో ఓ ఫాంటసీ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రణ్‌వీర్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా పై అఫీషియల్ ప్రకనట వెలుబడనుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సక్సెస్ తర్వాత 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరంజీవి, మహేష్ బాబులతో ఓ పాత్ర చేయించాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నాడు. మరి వీరిద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.
హనుమాన్ మూవీ విషయానికొస్తే.. చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' మూవీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీ విడుదలకు ముందు నుంచి ఆ తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రెండు సార్లు అప్డేట్ ఇచ్చినా.. ఇప్పటికీ స్ట్రీమింగ్కు రాలేదు. ఈ నెల 8 లేదా 9న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ ఓటీటీలోకి ఎపుడు వస్తుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.
హనుమాన్ సినిమా 2024లో తొలి హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన స్క్రీన్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి గెలిచింది. బడా హీరోలను తలదన్నే వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.
ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగుతూనే వస్తోంది. విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. విడుదలైన 3 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో టాలీవుడ్లోనే.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ. అంతేకాదు అమెరికా బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది.
హనుమాన్ మూవీ రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి టాలీవుడ్లో మరే బడా హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పింది. గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 100 కోట్ల లాభాలను ఆర్జించడం మాములు ఊచకోత కాదు. ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.
ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ సంక్రాంతి సినిమాగా హనుమాన్ మరో రికార్డు. హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు. ఈ సినిమా తెలంగాణ, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్, హిందీలో రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. హనుమాన్ సినిమాను ఇప్పటి వరకు థియేటర్స్‌లో కోటి మందికి పైగా వీక్షించారు. అది కూడా ఓ రికార్డు.
మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రూపేణా..మరో రూ. 50 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టడం శుభ పరిణామం. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ విడుదల చేయబోతున్నారు.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.