8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బొనంజా.. కొత్త పే కమిషన్‌పై బిగ్‌ అప్‌డేట్ ఇదిగో..!

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో దీపావళి పండుగ రెట్టింపు సంతోషాన్ని తీసుకువచ్చింది. డీఏను 3 శాతం పెంచగా.. మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తం జమ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై ఈ నెలలో కీలక అప్‌డేట్ రానుంది. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) సమావేశం ఈ నెలలో జరగనుంది.
 

1 /10

ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వారధిలా జేసీఎం పనిచేస్తోంది. దీనికి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తుండగా.. గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘాలు నాయకులు సభ్యులుగా ఉన్నారు.  

2 /10

ఈ నెలలో జేసీఎం భేటీ కానుండడంతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించి జేసీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

3 /10

కొత్త పే కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయితే సాధ్యమైనంత త్వరలోనే మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

4 /10

ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త కమిషన్ ఏర్పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటు కాగా.. దాని సిఫార్సులు 2016లో అమలులోకి వచ్చాయి.  

5 /10

ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్రం త్వరగా స్పందించి కమిషన్ ఏర్పాటు చేసినా.. 2026 నుంచి సిఫార్సులు అమలు అవుతాయి.  

6 /10

వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కమిషన్ ఏర్పాటు అయితే ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు రావడం ఖాయం.  

7 /10

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ప్రకారం.. ఉద్యోగుల బేసిక్ పే రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. అంతేకాకుండా రిటైర్మెంట్ తరువాత కనీస పెన్షన్‌ రూ.3,500 నుంచి రూ.9 వేలకు పెరిగింది.  

8 /10

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ప్రకారం.. ఉద్యోగుల బేసిక్ పే రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. అంతేకాకుండా రిటైర్మెంట్ తరువాత కనీస పెన్షన్‌ రూ.3,500 నుంచి రూ.9 వేలకు పెరిగింది.  

9 /10

కొత్త పే కమిషన్‌లో 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని తీసుకొని పే మ్యాట్రిక్స్ సిద్ధం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే బేసిక్ పే 18 వేల నుంచి 34,560కి పెరుగుతుంది. కనీస పెన్షన్ రూ.17,280 అవుతుంది.  

10 /10

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. జీతాల పెంపు, కొత్త పేమిషన్ ఏర్పాటు గురించి కచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.