Sanjosh: పవన్ ఫ్యాన్.. సంపూ సోదరుడు.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకోస్తోన్న వరంగల్ కుర్రాడు సంజోష్..

Sanjosh: టాలీవుడ్ సహా ప్రతి ఇండస్ట్రీలో కొత్త నీరు ఎపుడు వస్తూనే ఉంటుంది. కొత్త, పాత కలయికలో ఇండస్ట్రీ మనగడ సాగిస్తూ ఉంటుంది. ఈ కోవలో టాలీవుడ్‌లో దూసుకువస్తోన్న వరంగల్ కుర్రాడు సంజోష్. ఇతను తెలుగులో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 06:05 PM IST
Sanjosh: పవన్ ఫ్యాన్.. సంపూ సోదరుడు.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకోస్తోన్న వరంగల్ కుర్రాడు సంజోష్..

Sanjosh: వెండితెరపై రాణించడం అంటే అంతా ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఒకటి రెండు సినిమాలకే పరిమితం. ఆ తర్వాత తమ టాలెంట్‌ ఉంటేనే ఇండస్ట్రీలో మనగలుగుతారు. ఇపుడు హీరో సంజోష్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ కుర్రాడు మాత్రం తనకున్న టాలెంట్ తో సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతున్నాడు. ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా... కేవలం సినిమాల్లో నటించాలనే ప్యాషన్ తో వెండితెరవైపు అడుగులు వేసిన ఈ యంగ్ హీరో పేరు సంజోష్.  

హిమాచల్ ప్రదేశ్ లో ‘మండి స్కూల్ ఆఫ్ డ్రామా’లో వర్క్ షాప్స్ చేసి...  ఆ తరువాత అనేక వర్క్స్ షాప్స్ అటెంప్ట్ చేసిన తరువాత... సిల్వర్ స్క్రీన్ పై  హీరోగా తెరంగేట్రం చేశారు. స్కూలింగ్ అంతా వరంగల్ కంప్లీట్ చేసేసి... కాలేజీ చదువులను హైదరాబాద్ లో పూర్తి చేసిన యువ హీరో సంజోష్... బేవర్స్ సినిమా డైరెక్టర్ తో కొంత కాలం ప్రయాణం చేసి... అతని డైరెక్షన్ లోనే 'బేవర్'స్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ లాంటి విలక్షణ నటుడు నటించడం విశేషం.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజోష్ కి... ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటించాలనేది కోరిక. అందుకే ఇప్పుడు మళ్లీ తన రెండో సినిమాగా ‘సోదరా’లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిర్మాతలు త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సంపూ సినిమా అంటే ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ తెలంగాణ ప్రాంతవాసులే కావడం విశేషం. పవన్ కల్యాణ్ నటించిన ‘అన్నవరం’ సినిమాని స్కూల్ లైఫ్ లో చూసి... సినిమాల్లోకి రావాలని ఇన్స్ ఫైర్ అయ్యానని అంటున్నాడు సంజోష్. చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా పెరిగిన సంజోష్ కి... సినిమాలంటే ప్రాణం. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు.   ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి  చిత్రాలకు ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నాడు...? ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News