Devara: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తరువాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించనుంది.
ముందుగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో విడుదల చేస్తాము అంటూ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రం షూటింగ్ చాలా పెండింగ్ ఉందని అంతేకాకుండా విఎఫ్ఎక్స్ వర్క్స్ టైం ఎక్కువ తీసుకుంటూ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు రాసాగాయి. దానికి తోడు విజయ దేవరకొండ సినిమాలోని.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేయబోతున్నాము అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో.. తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయితేనే విజయ్ దేవరకొండ సినిమా యూనిట్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్ని రోజులకు విడుదల తేదీ పైన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు దేవర యూనిట్.
తాజాగా దేవరకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ఒక పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసి మరి ప్రకటించారు. దసరాకు దేవర వేట ఉండబోతోందని ఈ పోస్టర్ ద్వారా తెలుపుతూ అక్టోబర్ 10న దేవర రిలీజ్ కాబోతోందని మేకర్లు అనౌన్స్ చేశారు.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024
న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ కోసం డిజైన్ చేసిన ఈ కొత్త పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు. పోస్టర్ అదిరిపోయిందని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే మరోపక్క సినిమా చాలా ఆలస్యం కానుందని, మరీ ఇంత వెనక్కి వెళ్లిపోయిందేంటి? అని కొంత మంది అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. కానీ ఎంత లేట్ అయినా పర్లేదు అవుట్ పుట్ మాత్రం అదిరిపోవాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా దసరాకి వచ్చి ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
ఎన్టీఆర్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
Read More: Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. భారత దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్కడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook