Cash Transaction Rules: ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. నగదు లావాదేవీలు జరిపేటప్పుడు తప్పకుండా అవసరమౌతాయి. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య నగదు లావాదేవీలకు పరిమితి ఏదైనా ఉందా లేదా, ఉంటే ఎంతవరకూ జరపవచ్చనేది పరిశీలిద్దాం.
నగదు లావాదేవీల విషయంలో పరిమితి తెలుసుకోకుంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి వస్తుంది. కుటుంబం పరిధిలో నగదు లావాదేవీలు జరుపుకునేందుకు ఏదైనా పరిమితి ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి ఖర్చులకు లేదా గిఫ్ట్ కింద డబ్బులు పంపిస్తే ఆ డబ్బుపై ట్యాక్స్ ఉండదు. భర్త ఆదాయం కిందే వీటిని పరిగణిస్తారు. అందుకే మీ భార్యకు మీరు డబ్బులు పంపించినా ఆమెకు ఏ విధమైన నోటీసులు అందవు. అయితే మీ భార్య ఈ డబ్బును తరచూ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుండి తద్వారా ఆదాయం పొందితే మాత్రం దానిపై ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇన్వెస్ట్ చేసే ఆదాయం ఏడాదికేడాది మీ భార్య ఆదాయంగా పరిగణించి ట్యాక్స్ లెక్కిస్తుంటారు. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 269 ఎస్ఎస్, సెక్షన్ 269 టి ప్రకారం 20 వేలు దాటిన నగదు లావాదేవీపై ట్యాక్స్ పడుతుంది. కొన్ని కేసుల్లో దీనికి మినహాయింపు ఉంటుంది.
తండ్రీ కొడుకులు, భార్యా భర్తల మధ్య లేదా సమీప బంధువుల మధ్య నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. వాటిపై ఎలాంటి ట్యాక్స్ పడదు. వీటికి మినహాయింపు ఇవ్వబడింది. అంటే మీ భార్యకు పంపించిన డబ్బులపై మీ భార్య ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందుకోరు. అయితే ఆ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దానిపై ఆదాయం పొందితే మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సిందే.
Also read: Income Tax Slab: బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారనుందా, పాత, కొత్త ట్యాక్స్ విధానాల అంతరం ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook