ఐఐటీ రూర్కీ విద్యార్థులతో కూడిన 50 మంది ట్రెక్కర్ల బృందం లాహౌల్-స్పితిలోని సిస్సు ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తెలిపారు.
అంతకు ముందు.. హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన 35 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులతో సహా మిగితా ట్రెక్కర్ల ఆచూకీ గల్లంతయ్యిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వారి ఆచూకీ తెలుసుకోడానికి రంగంలోకి దిగారు.
కులు, కంగ్రా, చంబా జిల్లాల్లో సోమవారం నుంచి మంచు వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా నేలమట్టమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో వర్షం, మంచు దట్టంగా కురుస్తున్న కారణంగా ఇప్పటివకు కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు, అనేక మంది గాయపడినట్లు తెలిసింది.
భారత వైమానిక దళం లాహౌల్-స్పితిజిల్లాలోని పింగ్డం లాలో ఇద్దరు జర్మన్ దేశస్థులను కాపాడారు. వారు రెండు రోజుల నుండి కురుస్తున్న మంచు వర్షంలో చిక్కుకున్నారు. వైమానిక దళం మంగళవారం ఉదయం ఇద్దరు జర్మన్ పౌరులను రక్షించారు.
అలాగే గతరాత్రి హిమాచల్ ప్రదేశ్‌లో కన్నూర్ జిల్లా పంగి గ్రామంలో ఒక కారు కొండపైనుంచి జారి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలు వెలికి తీసేందుకు పోలీస్ బృందం అక్కడికి వెళ్ళింది. మృతుల కుటుంబాలకు పది వేల రూపాయిల సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
The group of 50 trekkers which includes IIT Roorkee students are safe in Sissu area of Lahul-Spiti: Himachal Pradesh CM Jai Ram Thakur pic.twitter.com/BDpqp65xGz
— ANI (@ANI) September 25, 2018
Himachal Pradesh: Situation in Mandi district improves after heavy rainfall lashed the state yesterday pic.twitter.com/2CoECMhj7S
— ANI (@ANI) September 25, 2018
Himachal Pradesh: Apple crop damaged due to fresh snowfall in Udaypur region of Lahaul-Spiti district pic.twitter.com/wicbhJ4ovI
— ANI (@ANI) September 25, 2018