Viral News: ఆ గ్రామంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా ముస్తాబ్ చేసి ఊరేగిస్తారు..ఎందుకో తెలుసా?

Viral News: రాజస్థాన్ రాష్ట్రంలో దివాళీ పండగ తర్వాత ఓ గ్రమంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా రెడీ చేసి ఊళ్లో పరిగెత్తిస్తారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2023, 12:16 PM IST
Viral News: ఆ గ్రామంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా ముస్తాబ్ చేసి ఊరేగిస్తారు..ఎందుకో తెలుసా?

 

Viral News: భారత్‌ భిన్న ఆచార, సంప్రదాయాల స్వరూపం..అన్ని దేశాలవారు భారత్‌లో నివసించడం వల్ల విభిన్న సాంస్కృతులు ఉంటాయి. అంతేకాదు పురాతన ఆలయాలు, వాటివెనక ఉన్న నమ్మకాలను కొందరు ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా..అవును భారతదేశంలో కొన్ని వింత ఆచారాలను ప్రజలు ఇప్పటికీ పాటిస్తున్నారు. వింత ఆచారాల్లో భాగంగా మీకు ఈ రోజు కొన్ని విషయాలు తెలయజేయబోతున్నాం..అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాజస్థాన్ రాష్ట్రం విభిన్న సంప్రదాయాలకు, సాంస్కృతులకు పుట్టినిళ్లు..అందికే ఈ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రసిద్ధి ఉంది. ఆధునిక జీవనశైలిలో కూడా చాలా మంది కొన్ని పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఇలాంటి కొన్ని సాంస్కృతులు, వింత సంప్రదాయాలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతూ వార్తల్లో కనిపిస్తున్నాయి. 

దసరా, దివాళీ ఇతర పండగ వేళల్లో అందరూ వాహనాలు, ట్రక్కులు, కార్లు, పనిముట్లను పూజిస్తారు. కానీ రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ జిల్లాలో ఎంతో భక్తి శ్రద్ధలతో గాడిదకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ పూజలు కేవలం కుమ్‌హార్‌ కులస్తులు మాత్రమే చేస్తారు. దీనిని ఆ ప్రాంతంలో తిక్రా పండుగ అని కూడా అంటారు. ఈ రోజు గాడిదను పెళ్లి కూతురు లాగా అదంగా అలకరించి..ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంతో వినోదంతో ఆనందంగా పండగను జరుపుకుంటారు. 

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

ఈ పండగను ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత జరుపుకుంటారు. అంతేకాకుండా ఊళ్లోకి గాడిదలను తీసుకువచ్చి..అచ్చం వధువుల్లా అలంకరించి వాటిని పరుగులు పెట్టిస్తారు. ఈ త్రిక పండగను రైతులుక ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగనే అక్కడి ప్రజలు గోవర్ధన పూజాగా కూడా భావిస్తారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్‌ ప్రాంతంలో పూర్వీకులు గాడిదలను పూజించేవారట..అంతేకాకుండా వీటితోనే సరకు, వస్తువు రవాణా చేసేవారని, అప్పటి నుంచే వీటిని పూజించడం ఆనవాయితిగా వస్తోందని అక్కడి ప్రజలు తెలిపారు. 

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News