ICC World Cup 2023: ప్రపంచకప్ 2023 టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్స్ చేరుకున్న రెండు జట్లు ఇవాళ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు కావడంతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకే ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ఒకే మ్యాచ్ ఓడిన సఫారీలు, ఒక్క మ్యాచ్ ఓడని ఇండియా మధ్య రసవత్తర పోరు ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా జరగనుంది.
ప్రపంచప్ 2023లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లు ఓ ఎత్తైతే ఇవాళ జరగాల్సిన మ్యాచ్ మరో ఎత్తు. టాప్ 2లో ఉన్న రెండు జట్ల మద్య జరగనున్న మ్యాచ్ ఇది. ఎదురేలేకుండా వరుసగా 7 విజయాలు సాధించి 8వ విజయం కోసం ఎదురు చూస్తున్న టీమ్ ఇండియా, ఈ ప్రపంచకప్‌లో ఐదుసార్లు 300 పైగా పరుగులు సాధించి ప్రత్యర్ధి జట్టును ఓడిస్తున్న సఫారీలను ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తి రేపుతోంది. టీమ్ ఇండియాలో ఇప్పుడు బ్యాటర్లు, బౌలర్లు ఇరువురూ అదరగొడుతున్నారు.
2011 ప్రపంచకప్‌లో కూడా ఒక్క దక్షిణాఫ్రికా చేతిలోనే ఇండియా ఓడిపోయింది. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్ ఇండియా చూస్తోంది. రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్య కుమార్ యాదవ్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంటే మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, బూమ్రాలతో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రాణిస్తుండటం బౌలింగ్ పరంగా ఇండియాకు తిరుగులేకుండా చేసింది. శ్రీలంక జట్టును కేవలం 55 పరుగులకే ఆల్ అవుట్ చేసిన సత్తా ఇండియా బౌలర్లది.
ఇక దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. రన్‌రేట్ పరంగా ఇండియా కంటే మెరుగ్గా ఉంది. ఒక్క నెదర్లాండ్స్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. అన్నింటికంటే కీలకమైన అంశమేంటంటే ఈ ప్రపంచకప్‌లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదుసార్లు 300 పరుగుల స్కోర్ దాటించారు. డీకాక్ ఏడు మ్యాచ్‌లలో 545 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్, బూమ్రా, షమీ, సిరాజ్
దక్షిణాఫ్రికా
బవుమా, డికాక్, డసెన్, మార్క్‌రమ్, మిల్లర్, క్లాసెన్, జాన్సన్, రబడ, మహారాజ్, ఎన్‌గిడి, కొయెట్టీ
Also read: ICC World Cup 2023: బెంగళూరు వేదికపై చెలరేగిన బ్యాటర్లు, పాక్‌పై ప్రశంసలు కురిపించిన కేన్ మామ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook