Low Blood Pressure: తక్కువ రక్తపోటు సమస్యైనా, అధిక రక్తపోటు సమస్యైనా శరీరానికి చాలా ప్రమాదకరం. బీపీ కారణంగా మెదడు, కాలేయంతో పాటు గుండెకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం అన్ని శరీర అవయవాలపై పడి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ తక్కువ రక్తపోటును వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అని కూడా అంటారు. సాధరణ రక్తపోటు 120/80గా ఉండాలి. దీని కంటే ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
తక్కువ రక్తపోటు వచ్చే లక్షణాలు ఇవే:
- మూర్ఛపోవడం
- తలలో చల్లగా అనిపించడం
- తరచుగా అలసిపోవడం
- ఏ సమయంలోనైనా చలిగా అనిపించడం
- చర్మం పసుపు రంగులోకి మారడం
- నాడీ సమస్యలు
- అధికంగా చెమటలు పట్టడం
- శరీర బలహీనత సమస్యలు
కొంతమందిలో బీపీ ఇలా కూడా వస్తోంది:
- అధికంగా వ్యాయామాలు చేయడం
- శారీరక శ్రమ చేయడం పోవడం
- లూజ్ మోషన్ సమస్య కారణంగా
- ఔషధాలను అతిగా వినియోగించడం వల్ల
- హీట్ స్ట్రోక్ కారణంగా
- అధిక రక్తస్రావం కారణంగా
- తక్కువ శరీర ఉష్ణోగ్రత కారణంగా
తప్పకుండా ఇలా చేయాలి:
- తక్కువ బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి అరగంటకు బీపీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- వీలైతే వ్యాధులను సంప్రదించడం చాలా మంచిది.
- ఈ సమస్యలతో బాధపడేవారు తల కింద ఎప్పుడూ దిండు పెట్టుకోకపోవడం చాలా మంచిది.
- బీపీ ఒక్కసారిగా పెరగడం, తగ్గడం వంటి సమస్యలున్న వారు ఆహారాలను అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
- బీపీ కారణంగా స్పృహ తప్పిపోతే గ్లాసు నీటిలో ORS కలుపుకుని తాగడం మంచిది.
- తక్కువ రక్తపోటు ఉన్నవారు తప్పకుండా నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..