Mouth Ulcers: చిటికెలో మౌత్ అల్సర్ సమస్యను తగ్గించే ఇంటి చిట్కాలు

మౌత్ అల్సర్లు అనేది ఒక సాధారణ సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. బుగ్గలు, నాలుక మరియు పెదవుల లోపల ఈ నోటిపూతలు ఏర్పడతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2023, 08:29 PM IST
Mouth Ulcers: చిటికెలో మౌత్ అల్సర్ సమస్యను తగ్గించే ఇంటి చిట్కాలు

Remedies Mouth Ulcers: ఇపుడున్న డిజిటల్ యుగంలో.. చిన్న సమస్యలు వచ్చిన వైద్యుడు వద్దకి వెళ్తున్నాం. కానీ ఇది వరకు కాలంలో అయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకే హాస్పిటల్ కి వెళ్లే వాళ్లం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి ఎక్కువగా మనం ఇంట్లో ఉండే కొన్ని ఔషదాల ద్వారా చికిత్స తీసుకునే వాళ్లం. ఇపుడు కూడా మనకు ఎదురయ్యే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. 

మనలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అల్లోపతి మెడిసిన్ వాడటం వలన ఆరోగ్య సమస్య తీరుతుంది కానీ వాటి ప్రభావం ఇతర అవయవాల మీద పడి సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. అల్లోపతి మెడిసిన్ వాడటం మంచిది కాదు అని మా అభిప్రాయం కాదు.. కానీ మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే ఔషదాలతో ఉపశమనం పొందవచ్చు. వీటి వలన శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు మరియు వీటి వలన ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. 

మౌత్ అల్సర్.. లేదా మనం సాధారణంగా నోటిపూతగా పిలుచుకునే ఇబ్బంది పెద్ద సమస్య కానప్పటికీ..  అవి వచ్చినప్పుడు ఆహారం తినడానికి మరియు నీళ్లు వంటివి త్రాగడానికి ఇబ్బంది పడతాము. దీంతో పాటుగా ఎవరితో అయిన మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటాము. మీకు చెప్పాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మౌత్ అల్సర్‌లకు సకాలంలో చికిత్స చేయకపోతే, అది కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. కావున నోటిపూత సమస్య ఎక్కువ కాలం ఉంటే.. వెంటనే చికిత్స చేయించుకోవాలి. కొన్ని చిట్కాల ద్వారా ఈ నోటిపూతలను తగ్గించుకోవచ్చు. 

మౌత్ అల్సర్లను తగ్గించే ఇంటి చిట్కాలు

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

నిమ్మ మరియు తేనె మిశ్రమాన్ని పుకిలించటం
నిమ్మ మరియు తేనె నీటితో పుకిలించటం  ద్వారా మౌత్ అల్సర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఒక గ్లాస్ నీళ్లను వేడి చేయాలి. అందులో నిమ్మరసం మరియు తేనెని కలపాలి. ఈ నీళ్ళని బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. కాస్త నీళ్లు చల్లబడ్డాక ఆ నీళ్ళతో నోటిని పుకిలించాలి. ఇలా చేయడం ద్వారా మౌత్ అల్సర్లను తగ్గించుకోవచ్చు.  

గ్లిజరిన్ - పసుపు  మిశ్రమం 
నోటి పూతని తగ్గించుకోవడానికి గ్లిజరిన్ - పసుపు మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా నోటి పూత వల్ల కలిగే మంటను తగ్గించుకోవచ్చు. దీని కోసం గ్లిజరిన్ లో కొంచెం పసుపుని కలిపి..  నోటి పుండ్లపై అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో పుకిలించాలి. ఇలా చేయడం ద్వారా కూడా మౌత్ అల్సర్ ను తగ్గించుకోవచ్చు.

Also Read: Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ: రేవంత్ రెడ్డి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News