Chandrababu Naidu Latest News: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. ఆయన రిమాండ్‌ను మరో 11 రోజులు పొడగిస్తూ.. ఏసీపీ కోర్టు తీర్పునిచ్చింది. తనకు మరోసారి రిమాండ్ విధించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇలాంటివి సాధారణంగా జరుగాతయని.. కోర్టు ఆధీనంలో ఉంటారని భావించాలని న్యాయమూర్తి సూచించారు. 11 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. వరుసగా పిటిషన్లతో కోర్టు సమయంతోపాటు విచారణ విషయంలో జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చంద్రబాబును అడిగారు. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు అన్నారు.
సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడిని వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని.. మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని న్యాయమూర్తి అన్నారు. ఇప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దని.. బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు వింటామని చెప్పారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు బయటపెట్టాలని అడగ్గా.. విచారణ సమయంలో వెల్లడించడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అధికారులు సేకరించిన వివరాలను కోర్టుకు సమర్పించారని తెలిపారు. ఆ పత్రాలను మీ న్యాయవాదుల వద్ద తీసుకోవాలని సూచించారు. రిమాండ్ మరో 11 రోజులు పొడగించడంతో అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు.
అంతకుముందు సీఐడీ అధికారులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు ప్రశ్నించారు. స్కామ్‌కు సంబంధించి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. శనివారం చంద్రబాబును దాదాపు 50 ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల సీఐడీ కస్టడీ నేటితో ముగిసింది. రెండు రోజుల విచారణలో మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. విచారణ ముగిసిన అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణకు సంబంధించి మొత్తం వీడియో తీయించారు.
Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి