8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన బిగ్ అప్డేట్ ఇది. ఓ రకంగా షాక్ కల్గించే పరిణామం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై అత్యంత ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలుంటాయా...ఆ వివరాలు మీ కోసం..
అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 8 వ వేతన సంఘం ప్రతిపాదన పరిశీలనలో లేదు. కొత్త విధానం గురించి ప్రకటన లేదు.
కొత్త విధానం ఏర్పాటైతే ప్రస్తుతం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉన్నట్టే ఏడాదికోసారి అప్రైజల్ ఉంటుంది. ఉద్యోగుల పనితీరు, సామర్ధ్యం, ద్రవ్యోల్బణం ఆధారంగా జీతభత్యాలు పెంచుతారు. ఈ విధానంతో నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరికీ ఉన్నత స్థానం లభిస్తుంది. ఈ కొత్త విధానం వస్తే ఇక వేతన సంఘం ఆగిపోతుంది.
అయితే 8వ వేతన సంఘం స్థానంలో కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అంటే ఉద్యోగుల పనితీరు, సామర్ధ్యం, ద్రవ్యోల్బణం ఆధారంగా జీతభత్యాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనిపై అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.
7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఏడాదికి ప్రభుత్వ వ్యయం లక్ష కోట్లు పెరిగింది. 8వ వేతన సంఘం ఏర్పడినా ఇదే పరిస్థితి ఉంటుంది.
8వ వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంపై అదనపు భారం కచ్చితంగా పడుతుంది. కానీ వినియోగదారుల వ్యయం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే కొద్దీ మార్కెట్లో నగదు ప్రవాహం అధికమౌతుంది. వస్తు, సేవల డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా జాతీయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతమౌతుంది
8వ వేతన సంఘం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల నుంచి 34 వేలకు పెరగనుంది. అటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది. పెన్షనర్లకు కనీస పెన్షన్ కూడ రెట్టింపు కావచ్చు. అందుకే ఉద్యోగులు,పెన్షనర్లలో చాలా ఆసక్తి నెలకొంది.
8వ వేతన సంఘం ఎప్పుడు అమలు చేస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం షాకింగ్‌గా ఉంది. ప్రస్తుతానికి ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా కొత్త విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు సమాచారం అందుతోంది.
నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది. ఈ లెక్కన 2026 జనవరి నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రావల్సి ఉంటుంది. కొత్త వేతన కమీషన్ అధ్యయనానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ఇప్పట్నించే ఏర్పాటుపై చర్చ నడుస్తోంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లలో భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే 2016 జనవరిలో 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు 7 వేలున్న ఉద్యోగుల కనీస వేతనం కాస్తా 18 వేలకు పెరిగింది. ఉన్నత పదవుల్లో ఉండేవారికి 2.5 లక్షలైంది.