KTR Counter to Congress and BJP: మంత్రి కేటీఆర్ రాజకీయ విమర్శలకు మరింత పదును పెంచేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు కోనేరు (చిన్ని) సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఆయనకు కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణికి శత్రువు మోడీ అని మండిపడ్డారు. కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ చేసిందేమీ లేదని.. ఏదో రకంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని కేంద్రం చూస్తోందని ఫైర్ అయ్యారు. మతాల పేరిట రెచ్చగొట్టి పాత గాయాలను రేపుతోందని విమర్శించారు.
మతాల మంటల్లో చిచ్చుపెట్టి చలి కాగాలని కేంద్రం చూస్తుంది. ఈ 9 ఏళ్లలో కేంద్రం ఏనాడూ తెలంగాణను ఆదుకోలేదు. భద్రాచలం అయిదు మండలాలు ఏపీలో కలిపింది బీజేపీ. బయ్యారం ఉక్కు కర్మాగారం చట్టంలో పెట్టి ఇప్పటికీ ఇవ్వలేదు. రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. కిషన్ రెడ్డికి సిగ్గు లజ్జ ఉంటే మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వమని అడుగాలి. దిక్కుమాలిన దందాలు ధర్నాలు చేస్తోంది ఇక్కడ బీజేపీ నాయకత్వం.
గ్యాస్ ధరలు పెంచిన బిజెపికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయాలి. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. మణిపూర్ మండుతున్న పట్టించుకోవటం లేదు. ఎన్నికలు వస్తున్నాయి అని రజాకార్ సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోంది. దిగజారి పోయిన ప్రధాని ఓ వైపు.. మరో వైపు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మరోవైపు.. అధికారం దూరం అవుతుందని ఫ్రస్టేషన్లో కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇస్తోంది. కాంగ్రెస్ అధికారిక రాష్ట్రంలో ఎక్కడైనా 4 వేల పెన్షన్లు ఇస్తున్నారా..? కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యమంత్రో తెలియదు.
వీళ్లు ఆరు గ్యారంటీలంటూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే సంక్షేమం వెనక్కి పోతుంది. రాజకీయ అస్థిరత తెలంగాణలో ఖాయం. తెలివిలేని, ఆలోచన లేని, వ్యూహం లేని వాళ్లు, డబ్బు సంచులతో దొరకిన వాళ్ళు ఇలాంటి హామీలు రాసిచ్చారు. కర్ణాటకలో పవర్ హాలిడే, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. అభివృద్దికి పైసలు లేవని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ చెప్పారు. ఇక ఖమ్మంలో కొంత మంది నాయకులు టికెట్ రాలేదని పార్టీ వీడి వెళ్లారు. వాళ్ల సమస్య, ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు." అని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook