Chandramukhi 2: వామ్మో.. ‘చంద్రముఖి 2’ రన్‌టైమ్‌ అన్ని గంటలా?

Chandramukhi 2: 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 02:31 PM IST
Chandramukhi 2: వామ్మో.. ‘చంద్రముఖి 2’ రన్‌టైమ్‌ అన్ని గంటలా?

Chandramukhi 2 Movie Runtime: రాఘవ లారెన్స్‌ (Lawrence), కంగనా రనౌత్‌ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్ట్రింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ ఏకంగా 170 నిమిషాలు (2 గంటల 50నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలుస్తోంది.  ఇంత నిడివి ఉన్న చిత్రాలు ఆడియెన్స్ ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి. ఈ విషయంలో ‘చిత్రయూనిట్ పూర్తి విశ్వాసంతో ఉందట. 

2005లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ , జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి సినిమా ఎంతపెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమాకు అస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి విడుదల చేయనున్నారు. 

సెప్టెంబరు 14న ఈ మూవీ నుంచి తొరి బొరి అనే లిరికల్ సాంగ్ ను రిలీజ చేశారు మేకర్స్. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను భువనచంద్ర రాయగా.. అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబరు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల విడుదల తేదీని సెప్టెంబరు 28కు పోస్ట్ పోన్ చేశారు. 

Also Read: Naga Chaitanya: కొత్త వ్యాపారంలోకి అక్కినేని హీరో.. మోటార్ రేసింగ్ టీమ్ ఓన‌ర్‌గా నాగ‌చైత‌న్య..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News