Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌కు బెయిల్ కోరడంలో ఇంత ఆలస్యమా, విస్మయం వ్యక్తం చేస్తున్న సీబీఐ మాజీ అధికారి

Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టు అయిన చంద్రబాబు వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయంటున్నారు ఆ సీబీఐ మాజీ డైరెక్టర్. అసలేం జరిగింది, పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 13, 2023, 07:29 AM IST
Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌కు బెయిల్ కోరడంలో ఇంత ఆలస్యమా, విస్మయం వ్యక్తం చేస్తున్న సీబీఐ మాజీ అధికారి

Chandrababu Case: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనంగా మారింది. అరెస్టు తరువాత కోర్టు చంద్రబాబుని రిమాండ్‌కు పంపి అప్పుడే మూడ్రోజులు కావస్తున్నాయి. అయినా ఇంకా చంద్రబాబు తరపున నిన్న సాయంత్రం వరకూ బెయిల్ పిటీషన్ దాఖలు కాలేదు..ఆశ్చర్యంగా ఉందా..కానీ ఇదే నిజం..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుని అరెస్టు చేసిన వెంటనే డిల్లీ సుప్రీంకోర్టు నుంచి ప్రముఖ న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా అండ్ టీమ్ రంగంలో దిగింది. ఇంకేముంది బెయిల్ దరఖాస్తు చేస్తారు, వచ్చేస్తుందనుకున్నారు. కానీ జరిగింది మరొకటి. చంద్రబాబు అరెస్ట్ అయి మూడ్రోజులైనా నిన్న సాయంత్రం తరువాతే బెయిల్ పిటీషన్లు దాఖలయ్యాయి. సీఐడీ పోలీసుల రిమాండ్ వ్యతిరేకిస్తూ పిటీషన్ దాఖలు చేసి వాదనలు విన్పించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆ తరువాత అసాధ్యం అని తెలిసినా హౌస్ కస్టడీపై దృష్టి సారించారు. హౌస్ కస్టడీపై ఏకంగా రెండ్రోజులు సమయం గడిచిపోయింది. ఏసీబీ కోర్టు హౌస్ కస్డడీ పిటీషన్ కూడా కొట్టివేయడంతో నిన్న సాయంత్రం బెయిల్ కోసం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపైనే సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ కేసులో చంద్రబాబు కోర్టు ద్వారా బెయిల్ కోరవచ్చని సీఐడీ పోలీసులు జారీ చేసిన మెమోలో కూడా స్పష్టంగా ఉందని నాగేశ్వరరావు తెలిపారు. సాధారణం పోలీసులు ఎవరినైనా నాన్ బెయిలబుల్ నేరం కింద అరెస్టు చేస్తే ముందుగా బెయిల్ కోసమో పిటీషన్ దాఖలు చేస్తారని..అప్పుడు కోర్టు రిమాండ్ అప్లికేషన్‌తో పాటు బెయిల్ పిటీషన్‌పై వాదన వింటుందన్నారు. వాదనల్లో బలాన్ని బట్టి కోర్టు రిమాండ్‌కు పంపడమా లేదా జ్యూడిషియల్ కస్టడీకి ఇవ్వడమా లేక బెయిల్ ఇవ్వడమా నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. 

సెప్టెంబర్ 9 ఉదయం చంద్రబాబు అరెస్ట్ అయితే సెప్టెంబర్ 12 సాయంత్రం వరకూ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు కాలేదు. ఆలా చేయకుండా రిమాండ్ వ్యతిరేకమంటూ వాదనలు విన్పించారు. పోనీ కోర్డు రిమాండ్‌కు తరలించినప్పుడైనా బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారా అంటే అదీ లేదు. దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదని తెలిసినా హౌస్ కస్టడీ పిటీషన్ దాఖలు చేసి మరో రెండ్రోజులు సమయం వృధా చేశారు. 

ఎందుకంటే వెంటనే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ కోరి ఉండి..ఆ బెయిల్‌ను కోర్టు తిరస్కరించి ఉంటే ఈపాటికి ఏపీ హైకోర్టులో అప్పీల్ చేసేందుకు అవకాశముండేది. కానీ నిన్న సాయంత్రం మాత్రమే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళంతా బహుశా దీనిపైనే వాదనలు కొనసాగవచ్చు. రేపటికి వాయిదా వేసి తిరస్కరిస్తే..అప్పుడు హైకోర్టుకు వెళ్తారా అన్పిస్తుంది. ఇదంతా చూస్తూంటే చంద్రబాబు బెయిల్‌పై విడుదల కావడం వారికి ఇష్టం లేదా అని సీబీఐ మాజీ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నారు.

Also read: Balakrishna: బావ కోసమా..ఆ స్థానం కోసమా, బాలకృష్ణ ఓదార్పు యాత్ర ప్రకటన మర్మమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News