Luna 25 Crashed Into Moon: చంద్రుడిపై కూలిపోయిన లూనా 25.. రష్యా ప్రయోగం ఫెయిల్

Luna 25 Crashed Into Moon: రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమస్ ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. రష్యా ప్రయోగించిన లూనా 25 ఉపగ్రహం చంద్రుడిపై కూలిపోయింది. ఈ మేరకు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Written by - Pavan | Last Updated : Aug 20, 2023, 05:37 PM IST
Luna 25 Crashed Into Moon: చంద్రుడిపై కూలిపోయిన లూనా 25.. రష్యా ప్రయోగం ఫెయిల్

Luna 25 Crashed Into Moon: రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమస్ ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. రష్యా ప్రయోగించిన లూనా 25 ఉపగ్రహం చంద్రుడిపై కూలిపోయింది. ఈ మేరకు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గత 47 ఏళ్ల రష్యా అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చంద్రుడిపైకి ఉపగ్రహం పంపించడం ఇదే మొదటిసారి. తాము ప్రయోగించిన ఉపగ్రహం ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు  ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా రష్యా నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా లూనా 25 కూలిపోయిందని రష్యా స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. 

ఆగస్టు 19, 20వ తేదీల్లోనే లూనా 25 ని గుర్తించడానికి అలాగే ఆ ఉపగ్రహంతో కాంటాక్టులోకి రావడానికి రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రుడి ఉపరితలంపై ఊహించని విధంగా మరో కక్ష్యలోకి ప్రవేశించిన లూనా 25.. చంద్రుడిపై కూలిపోవడంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని వెల్లడించింది. ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన వ్యోమ నౌక క్రాఫ్ట్ ఆగస్టు 21న చంద్రుడిపై దిగాల్సి ఉండగా.. శనివారం ఉదయం 11.57 గంటలకు ప్రీ ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశించే క్రమంలోనే పరిస్థితి అదుపు తప్పినట్టు రష్యన్ స్సేస్ ఏజెన్సీ ప్రకటించింది. 

ఆగస్టు 19, 20వ తేదీల్లోనే లూనా 25 ని గుర్తించడానికి అలాగే ఆ ఉపగ్రహంతో కాంటాక్టులోకి రావడానికి రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రుడి ఉపరితలంపై ఊహించని విధంగా మరో కక్ష్యలోకి ప్రవేశించిన లూనా 25.. చంద్రుడిపై కూలిపోవడంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని వెల్లడించింది. ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఆగస్టు 21న చంద్రుడిపై దిగాల్సి ఉండగా.. శనివారం ఉదయం 11.57 గంటలకు ప్రీ ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశించే క్రమంలోనే పరిస్థితి అదుపు తప్పినట్టు రష్యన్ స్సేస్ ఏజెన్సీ ప్రకటించింది.

ఈ ప్రయోగం ఎందుకు విఫలమైంది, ఎలాంటి సాంకేతిక లోపాలు అందుకు కారణమయ్యాయి అనే విషయంలో ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయకుండా జాగ్రత్తపడిన రోస్కోమస్.. ప్రయోగం ఎందుకు విఫలమైంది అనే విషయంలో దర్యాప్తు చేపట్టనున్నట్టు స్పష్టంచేసింది. 

1976 నాటి లూనా 24 ప్రయోగం తరువాత రష్యా మూన్ మిషన్ చేపట్టలేదు. 47 ఏళ్ల తరువాత చంద్రుడిపైకి రష్యా చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. లూనా అనే పదం లూనార్ నుంచి వచ్చింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రణాళికల ప్రకారం రేపు సోమవారం .. ఆగస్టు 21న చంద్రుడిపై సౌత్ పోల్‌లో లూనా 25 సురక్షితంగా దిగాల్సి ఉంది. కానీ లూనా 25 చంద్రుడిపై కూలిపోవడంతో రష్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ ప్రయోగంలో విజయం సాధించలేకపోయింది. 
ఇది కూడా చదవండి : 
Russia: చంద్రయాన్​-3కి పోటీగా 'లూనా​ 25'.. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్..  
ప్రపంచ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే 1957లో రష్యా తొలిసారిగా స్పూట్నిక్ 1 పేరుతో శాటిలైట్ ప్రయోగించింది. ఆ తరువాత మరో నాలుగేళ్లకు తొలిసారిగా మానవుడిని అంతరిక్షంలోకి పంపించి మరో ఘనతను సొంతం చేసుకుంది. అప్పటి నుండి అంతరిక్ష పరిశోధన రంగంలో పైచేయి సాధిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న రష్యా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3 Updates: చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ ఇక లాంఛనమే, జాబిల్లికి 25 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 3

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News