World Cup 2023: అక్టోబర్ 5 నుండి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మెగా టోర్నమెంట్ భారత్ లో ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచంలో అత్యధికులు చూసే వన్డే వరల్డ్ కప్ ను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ హక్కులను దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఐపీఎల్ హక్కులను చేజార్చుకున్న స్టార్ స్పోర్ట్స్ వారికి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టెలికాస్ట్ హక్కులతో కోట్ల వర్షం కురియబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా యమ క్రేజ్ ను కలిగి ఉంటుంది. అన్ని మ్యాచ్ లు ఒక ఎత్తు అయితే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లు ఒక ఎత్తుగా నిలుస్తాయి. భారత్, పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారు.
ఆ రోజు దేశంలో సగానికి పైగా జనాలు టీవీలకు అతుక్కు పోతారు. అందుకే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రసారం అయ్యే యాడ్స్ కు మంచి రీచ్ ఉంటుంది. కనుక 10 సెకన్ల యాడ్ ను ఒక సారి చూపించేందుకు గాను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వారు ఏకంగా రూ.30 లక్షలు వసూళ్లు చేయబోతున్నారు.
సాధారణంగా అయితే మ్యాచ్ ను బట్టి.. ఆ మ్యాచ్ లో ఆడే జట్లను బట్టి అయిదు నుండి 15 లక్షల వరకు వసూళ్లు చేస్తారు. భారత్ పాల్గొన్న మ్యాచ్ లు.. అది కూడా కాస్త బలమైన జట్లతో ఆడిన మ్యాచ్ లకు 15 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసే స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం పాక్ తో భారత్ ఆడే మ్యాచ్ కి మాత్రం 10 సెకన్ల యాడ్ కి రూ.30 లక్షల ను వసూళ్లు చేయబోతుంది.
Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్ కాల్‌తో..!
ఒక వేళ ఇండియా పాక్ జట్లు లీగ్, సెమీస్, ఫైనల్ లో పోటీ పడితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వారికి పంట పండినట్లే. ఇతన మ్యాచ్ ల ద్వారా వచ్చిన మొత్తంతో ఈ మూడు మ్యాచ్ లతో సమానమైన రెవిన్యూ వచ్చే అవకాశం ఉంది అంటూ క్రికెట్ అభిమానులు.. విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
టెలికాస్ట్ ను ఉచితంగా అందిస్తున్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్ యాడ్స్ రూపంలో మాత్రం భారీగా దండుకోబోతుంది. గతం వరల్డ్ కప్ లో 10 సెకన్ ల యాడ్ కు గాను 5 నుండి 7.5 లక్షల రూపాయలను వసూళ్లు చేయడం జరిగింది. ఆ మధ్య జరిగిన ఆసియా కప్ లో టెలికాస్ట్ సమయంలో కూడా పది లక్షల లోపు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ కప్ స్పాన్సర్‌షిప్ కోసం కూడా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. కో ప్రజెంటర్స్ స్లాట్ కి రూ.150 కోట్లు, అసోషియేట్ స్పాన్సర్స్ స్లాట్ కి రూ. 88 కోట్లు, పవర్డ్ బై స్పాన్సర్స్ స్లాట్ కోసం రూ. 75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రపంచ కప్ టెలికాస్ట్ హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ కి లాభం పదుల రెట్లు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Tillu Square: సిద్దు 'టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
World Cup 2023: భారత్ - పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ ప్లేకి రూ.30 లక్షలు