ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై చెన్నైలో ఓ చీటింగ్ కేసు నమోదైంది. హృతిక్ తోపాటు మరో 8 మంది ఈ చీటింగ్ కేసులో బుక్ అయ్యారు. కొడుంగైయ్యార్కి చెందిన ఆర్ మురళీధరన్ అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గురుగ్రామ్కి చెందిన ఓ వాణిజ్య సంస్థ హృతిక్ రోషన్ సొంత బ్రాండ్ అయిన హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తులకు చెన్నైలో తనని స్టాకిస్ట్ గా నియమించిందని.. అయితే, ఆ తర్వాత నటుడు హృతిక్ రోషన్తో కలిసి చేతులు కలిపిన ఇతర వ్యక్తులు తనని రూ.21 లక్షల వరకు మోసం చేశారని ఆర్ మురళీధరన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మురళీధరన్ ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు హృతిక్ రోషన్తోపాటు మరో 8 మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.