IRCTC Server Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

IRCTC Technical Issue: రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jul 25, 2023, 12:07 PM IST
IRCTC Server Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

IRCTC Technical Issue: ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. టికెట్ బుకింగ్ సమస్యలపై ఐఆర్‌సీటీసీ వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారు. టెక్నికల్ సమస్యపై ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.  తమ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్ సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని తెలిపింది. తమ టెక్నికల్ టీమ్ పరిశీలిస్తోందని.. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కారిస్తామని పేర్కొంది. ఆ తరువాత ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు అమెజాన్‌, మేక్‌మైట్రిప్‌ వంటి ఆన్‌లైన్ యాప్స్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.  

 

తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏసీ తరగతి (2A/3A/CC/EC/3E) కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు తత్కాల్ కోటా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఐఆర్‌సీటీసీ టెక్నికల్ సమస్య కారణంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు. ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్న వాళ్లు టికెట్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. 

టికెట్ల బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ప్రయాణికులు ముందుగానే ట్రైన్ బెర్త్‌లు బుక్ చేసుకుని హ్యాపీగా ప్రయాణించవచ్చు. సాంకేతిక సమస్య కారణంగా టిక్కెట్లు కూడా బుక్ చేసుకోలేకపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. టెక్నికల్ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. తమ డబ్బులు కట్ అయ్యాయని.. కానీ టికెట్ బుక్ కావడం లేదని చెబుతున్నారు. ఇందుకు స్క్రీన్ షాట్ల‌ను షేర్ చేస్తున్నారు.

Also Read: Schools Colleges Bandh Today: రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!  

 Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News