AP Volunteers: వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వైసీపీ నేతలతో పాటు వాలంటీర్లు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కోరారు. అటు ఏపీ మహిళా కమీషన్ సీరియస్ అయింది.
గ్రామాల్లోని వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల పాలనలో 29 వేలమంది మహిళలు కన్పించకుండా పోగా 14 వేల మంది ఇళ్లకు చేరారని, మిగిలిన 15 వేలమంది మహిళల ఆచూకీ ఎక్కడని పవన్ ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. అటు వైసీపీ నేతలు ఇటు వాలంటీర్లు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ మహిళా కమీషన్ సీరియస్‌గా తీసుకుంది. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై పదిరోజుల్లోగా సమాదానం ఇవ్వాలని లేకపోతే క్షమాపణలు కోరాలని నోటీసుల్లో పేర్కొంది. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయం పూర్తిగా తెలుసుకోవల్సిన బాధ్యత ఏపీ ప్రజలు, ప్రభుత్వంపై ఉందన్నారు మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ.
10 రోజుల్లోగా వివరణతో పాటు చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు ఇవ్వాలని లేకుంటే మహిళలకు క్షమాపణలు చెప్పాలని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇష్టానుసారం మాట్లాడతామంటే కుదరదన్నారు. మహిళల్ని అడ్డం పెట్టుకుని మాట్లాడితే సహించేది లేదన్నారు. ఏపీలో వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చెబుతున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తమపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల నిరసనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. తక్షణం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని కోరారు.
Also read: AP Rains Alert: ఏపీలో ఇవాళ రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook