PM Modi Visit To Warangal: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని టూర్ షెడ్యూల్‌ను వివరించారు.
==> రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారు.
==> తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
==> తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం.
==> కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలి.
==> రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరనున్నారు.
==> మంత్రులు,ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలి.
==> బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు.. ఇతర పార్టీలు చేసే విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
==> కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో అనేకసార్లు కలిశాయి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కేసీఆర్ మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలి. అవి రెండు బొమ్మ బొరుసు పార్టీలు.
==> గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
==> బీజేపీ మాత్రమే కుటుంబపాలనను అంతమొందించగలదు
==> బీజేపీ మాత్రమే న్యాయమైన పాలన చేయగలదు.
==> గత 9 ఏండ్లుగా మోదీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నది.
==> మంచి ప్రభుత్వం తెలంగాణకు అందిస్తాం.
==> చాలా ఏండ్ల తర్వాత భారత ప్రధానిగా మోదీ వరంగల్‌కు వస్తున్నారు.
==> వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీది.
==> వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ కేంద్రమే మంజూరు చేసింది.
==> వరంగల్ అభివృద్ధి విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నది.
==> రైలు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో భవిష్యత్‌లో రైలు ఇంజన్ సహా.. వ్యాగన్లు, కోచ్‌లు ఏమైనా తయారు చేసుకోవచ్చు.
==> అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చింది.
==> బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ ఎయిర్‌పోర్టు అంశం మొదటి
==> కవిత అరెస్ట్ చూడాల్సిన పని బీజేపీది కాదు. సీబీఐ పని అది.
==> కేసీఆర్‌ది కమీషన్ల ప్రభుత్వం..
==> కుటుంబ వాటాలు, పెత్తనం లేని పరిపాలన తెలంగాణలో తీసుకువస్తాం.
==> మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో నేను, మా అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లెటర్స్ రాశాం.
==> తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు మొదటి ప్రాధాన్యత.
==> ఎయిర్ జర్నీని బీజేపీ ప్రోత్సాహిస్తుంది.
==> ఓరుగల్లు ప్రజలు మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
==> స్మార్ట్ సిటీ, అమృత్ వంటి స్కీమ్స్ ఇచ్చాం. పీఎం మిత్ర ద్వారా మెగా టెక్స్ టైల్ పార్క్‌కు కేంద్రం నిధులు
==> రూ.550 కోట్లతో జాతీయ రహదారి అనుసంధానం
==> మెగా టెక్స్ టైల్ పార్క్ రావడానికి స్టేట్ తరఫున కృషి చేశాను
Also Read: Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి భారీ షాక్.. పిటిషన్ కొట్టివేసి గుజరాత్ హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kishan Reddy: ఆ ఘనత ప్రధాని మోదీదే.. వరంగల్‌కు ఎయిర్ పోర్టు తీసుకువస్తాం: కిషన్ రెడ్డి