భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5:05 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి గౌరవార్థం వారం రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వాజ్‌పేయి సంతాపం సూచికగా న్యూఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ కార్యాలయంలో బ్రిటన్ జెండాను సగం వరకు అవనతం చేశారు. మరిషస్ దేశ జాతీయ పతకాన్ని కూడా వాజ్ పేయి సంతాపం సూచికగా అవనతం చేశారు.
Union Jack flies at half-mast at the British High Commission in New Delhi as a mark of respect to Former PM #AtalBihariVajpayee. pic.twitter.com/QN0DKiB5OW
— ANI (@ANI) August 17, 2018
Joining us in our moment of grief! In an unprecedented gesture, the Government of #Mauritius has decided that both Indian and Mauritian flag will fly half-mast on government buildings today as a mark of respect following the sad demise of former PM Vajpayee. pic.twitter.com/qn8ZA38tT2
— Raveesh Kumar (@MEAIndia) August 17, 2018
93 ఏళ్ల మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు యమునా నది ఒడ్డున ఉన్న రాష్ట్రీయ స్మృతి స్థల్లో జరిగాయి. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్రీయ స్మృతి స్థల్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, భూటాన్ రాజు జిగ్మే కేసర్, ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, శ్రీలంక తాత్కాలిక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కిరియల్లా, నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు.