World Cup 2023 Schedule Delay: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అందరూ భావించగా.. వాయిదా పడింది. ఇప్పటికే భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించి వేదికలు ఖరారు అయిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అని బీసీసీఐ సీనియర్ అధికారి ఆరోపించారు. పాక్ చెన్నైలో ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో షెడ్యూల్ ప్రకటించడం ఆలస్యం అవుతుందన్నారు.
“పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమకు నచ్చినది చెప్పగలదు. షెడ్యూల్‌ను ప్రకటించడంలో జాప్యానికి పీసీబీయే కారణమన్నది వాస్తవం. మొదట అహ్మదాబాద్‌లో ఆడేందుకు సిద్ధంగా లేని పాకిస్థాన్.. ఇప్పుడు చెన్నైలో ఆడేందుకు కూడా సిద్ధంగా లేదు. పాక్ జట్టు ఎల్లప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు..” అని బీసీసీఐ సీనియర్ అధికారి InsideSport.IN వెబ్‌సైట్‌తో చెప్పారు.
ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ సమర్పించిన ముసాయిదా ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అహ్మదాబాద్‌లో ఆడేందుకు ఇష్టపడని పాక్.. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తోంది. అహ్మదాబాద్‌లో కుదరకపోతే చెన్నైలో భారత్‌తో ఆడేందుకు బీసీసీఐ పీసీబీకి అవకాశం కల్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ముసాయిదా షెడ్యూల్‌ను స్వీకరించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో తమ మ్యాచ్ కోసం చెన్నై నుంచి వేదికను మార్చాలని బీసీసీఐని పీసీబీ అభ్యర్థించింది.
భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్ జట్టు పాల్గొంటుందా..? లేదా..? అనేది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుందని పీసీబీ చైర్మన్ నజం సేథీ స్పష్టం చేశారు. తాము ప్రపంచకప్ షెడ్యూల్‌కు ఆమోదం లేదా నిరాకరించేందుకు అవకాశం లేదని ఐసీసీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో భారత్ హై వోల్టేజ్ పోరు జరగనుంది. అయితే ఉత్తర భారత్ నగరాల్లో మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ సుముఖంగా లేదని నివేదికలు సూచిస్తున్నాయి.
“భారతదేశం విషయానికి వస్తే.. వారు ఎప్పుడు ఆడటానికి వెళ్లాలో వారి ప్రభుత్వమే నిర్ణయించేది. అహ్మదాబాద్‌లో ఆడతామా అని మమ్మల్ని అడగడం లేదు. సమయం వచ్చినప్పుడు.. మేం వెళ్తున్నామా లేదా అనేది నిర్ణయం అవుతుంది. మేము ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడ ఆడాలో మా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మా నిర్ణయం ఈ రెండు ముఖ్యమైన షరతులపై ఆధారపడి ఉంటుంది” అని నజం సెథీ తెలిపారు.
Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన
Also Read: Arshin Kulkarni: చితక్కొట్టాడు.. సిక్సర్ల వర్షం కురిపించిన అర్షిన్ కులర్ణి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి