Manipur Violence Update: హింసాత్మక ఘటనలతో కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ అట్టుడుకుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా... మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఖమెన్‌లక్ ప్రాంతంలో ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి. దుండగలు చాలా ఇళ్లను కూడా తగులబెట్టినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తాజా ఘటనతో ఎదురుదెబ్బ తగిలింది. హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మళ్లీ కర్ఫ్యూ సమయాన్ని పొడిగించారు.
ఇదే కారణమా...
మణిపూర్ లో చాలా ఏళ్లుగా కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మే నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది వరకు మృతి చెందారు. ఆ రాష్ట్రంలో దాదాపు 53 శాతం మంది మైతీలు, 40 శాతం వరకు నాగాలు, కుకీ తెగలకు చెందినవారు ఉన్నారు. అయితే మణిపూర్ లో మెజారిటీ వర్గంగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదా కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇతర గిరిజన తెగలు అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. వీరి మధ్య సయోధ్య నెలకొల్పడానికి మణిూర్ గవర్నర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. త్వరలో దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Also Read: NEET 2023 Results: నీట్ 2023 ఫలితాల వెల్లడి, ఏపీ, తమిళనాడు విద్యార్ధులకే మొదటి ర్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook