Weight Loss Drinks: ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆహారపు అలవాట్ల కారణంగా నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఫిజిక్ పాడైపోతుంటుంది. బరువు పెరిగి స్థూలకాయం వచ్చేస్తుంది. నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే కొన్ని డైట్‌లో మార్పులతో బెల్లీ ఫ్యాట్, అధిక బరువు సమస్యకు చెక్ చెప్పవచ్చు.
బరువు తగ్గించేందుకు స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడం, వర్కవుట్స్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే కొన్ని పద్ధతులు లేదా డైట్ మార్పులతో ఇది సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఉదయం లేచినవెంటనే కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే ఇది సాధ్యమేనంటున్నారు.
వాము అనేది ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే మసాలా దినుసు. రుచి కోసం వంటల్లో వినియోగిస్తుంటారు. వామునే క్యారమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. వాము తినడం వల్ల శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా బరువు తగ్గడంలో దోహదమౌతుంది. ఓ గ్లాసు నీళ్లలో వాము వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వడకాచి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే మరో పదార్ధం సోంపు. సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా దీన్ని వినియోగిస్తుంటారు. బరువు తగ్గేందుకు సోంపు నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఓ గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పరగడుపున వడకాచి తాగాలి. ఇలా చేయడం వల్ల వారాల వ్యవధిలోనే బరువు తగ్గుతారు.
గ్రీన్ టీ అనేది అందరికీ సుపరిచితం. అద్భుతమైన ఆరోగ్యకరమైన టీ ఇది. పాలు పంచదార టీకు గ్రీన్ టీ సరైన ప్రత్యామ్నాయం. రోజూ ఉదయం పరగడుపున గ్రీన్ టీ సేవించడం అలవాటు చేసుకుంటే బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. అయితే రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ సేవించడం మంచిది కాదు.
నిమ్మరసం బరువు తగ్గించేందుకు మరో అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఇది కూడా ఉదయం పరగడుపున తాగాల్సి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండి పింక్ సాల్ట్ కలుపుకుని తాగాలి. నియమిత పద్ధతిలో ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. చాలా త్వరగా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Dark Circles Remedies: కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ చెప్పే నేచురల్ చిట్కాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Weight Loss Drinks: రోజూ పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకుంటే, 3 వారాల్లో అధిక బరువు మాయం