Shani Vakri 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా భావిస్తారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 30 ఏళ్ల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభంలో గోచరిస్తున్నాడు. జూన్ 17న ఇదే రాశిలో శని తిరోగమనం చేయబోతున్నాడు. సాధారణంగా శని యెుక్క రివర్స్ కదలిక చెడు ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడు ఏయే రాశులపై దుష్ప్రభావాలను చూపుుతందో తెలుసుకుందాం.
దుష్ప్రభావం
మేషం: శని తిరోగమనం వల్ల పనిలో అడ్డంకులు వస్తాయి. మీరు మీ సన్నిహితుల నుండి విడిపోయే అవకాశం ఉంది.
వృషభం: మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ జీవనశైలిలో మార్పులు రావచ్చు.
మిథునం : ఈ సమయంలో ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.
కర్కాటకం: కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.
సింహం: పాత స్నేహితులు లేదా బంధువులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తారు.
కన్య: ఉద్యోగానికి వెళ్లాలనే భయం ఉంటుంది.
తుల: ఆర్థికపరమైన ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.
వృశ్చికం: వ్యక్తిగత సంబంధాలలో అస్థిరత ఏర్పడవచ్చు. అంతేకాకుండా మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
సానుకూల ప్రభావం
శని తిరోగమనం సమయంలో మాంగ్లిక్ పనులు ఇంట్లోనే చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. విద్యారంగంలో పురోగతి ఉంటుంది. మీరు చాలా రంగాలలో విజయం సాధిస్తారు. అయితే, ఈ సమయంలో సహనం అవసరం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు.
Also Read: Jupiter Mahadasha: 16 ఏళ్లపాటు ఉండే గురు మహాదశ.. ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook