Custody Pre Release: నాగచైతన్య 'కస్టడీ'కి భారీ దెబ్బ.. ప్రీ రిలీజ్ బిజినెస్లో ఊహించని డ్రాప్!

Drop in Custody Pre Release Business: నాగచైతన్య కస్టడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. చైతూ గత సినిమాల ఎఫెక్ట్ తో పాటు ఇతర సినిమాల ఎఫెక్ట్ కూడా పడిందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 2, 2023, 11:07 PM IST
Custody Pre Release: నాగచైతన్య 'కస్టడీ'కి భారీ దెబ్బ.. ప్రీ రిలీజ్ బిజినెస్లో ఊహించని డ్రాప్!

Naga Chaitanya’s Custody Pre Release Business: సాధారణంగా హీరోల చివరి సినిమాల కలెక్షన్స్ బట్టి వారి ప్రస్తుత సినిమాల మార్కెట్ నిర్ణయిస్తూ ఉంటారు.  ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే, అయితే ఇప్పుడు నాగచైతన్య కస్టడీ సినిమాకి ఇదే పెద్ద తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. నిజానికి ఆయన గత సినిమాలు మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో వచ్చి బోల్తా పడుతున్న ఇతర సినిమాల ఇంపాక్ట్ కూడా ఆయన సినిమా మార్కెట్ మీద పడుతున్నాయని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన విరూపాక్ష మినహా మరి ఏ సినిమా హిట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలను కొనుగోలు చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాతిక కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావించారు.

Also Read: Simhadri 4K: సింహాద్రి రీ రిలీజ్.. రంగంలోకి దిల్ రాజు.. మామూలు మాస్ కాదుగా ఇది!

దానికి బయ్యర్లు కూడా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు బోల్తా పడుతున్న నేపథ్యంలో అంత అయితే తాము పెట్టలేమని చేతులెత్తేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కస్టడీ సినిమాకి పాతిక కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనుకుంటే అది 18 కోట్లకే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి తోడు అక్కినేని హీరోల మార్కెట్ కూడా బాలేదని అంటున్నారు.

ఇటీవల అఖిల్ ఏజెంట్ నాగార్జున గోస్ట్ వంటి సినిమాలు నాగచైతన్య చివరిగా నటించిన థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో వారి మీద అంత డబ్బు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మే 12వ తేదీన కస్టడీ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రియమణి, సంపత్ రాజ్, అరవింద్ స్వామి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాని రెండు భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్  చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీలో కూడా సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఇక ఈ సినిమాకి ఇళయరాజా యువన్ శంకర్ రాజా, ఇళయరాజ సంగీతం అందించగా సినిమా మీద అంచనాలు ఉన్నా మార్కెట్ మాత్రం పెద్దగా లాభం లేదని తెలుస్తోంది.

Also Read: Samantha Deleted Story: సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. పాపం షాకిచ్చారుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News